కువైట్‌లో ముగ్గురు ప్రవాసులకు మూడేళ్ల జైలు, బహిష్కరణ వేటు..!!

- November 03, 2026 , by Maagulf
కువైట్‌లో ముగ్గురు ప్రవాసులకు మూడేళ్ల జైలు, బహిష్కరణ వేటు..!!

కువైట్: ఓ ఆపరేటివ్ సొసైటీకి చెందిన సరఫరా కేంద్రం నుంచి ఆహార పదార్థాలను అక్రమంగా తీసుకెళ్లిన కేసులో ముగ్గురు ప్రవాసులకు క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షాకాలం పూర్తయిన అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. నిందితుల్లో ఈజిప్ట్, బంగ్లాదేశ్, భారత్‌కు చెందిన ప్రవాసులు ఉన్నారు. 

అల్‌జహ్రా గవర్నరేట్‌లోని సహకార సంఘం సరఫరా కేంద్రం నుంచి ఆహార పదార్థాలను అక్రమంగా తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది. ఒక్కో విక్రయ సమయంలో 250 నుంచి 500 గ్రాముల వరకు ఆహార పదార్థాలను అక్రమంగా మళ్లించినట్లు కేసులో ఆరోపణలు నమోదయ్యాయి.

ఈ వ్యవహారంలో సంబంధిత సరఫరా కేంద్రం డైరెక్టర్‌కు కూడా కోర్టు KD 3,000 జరిమానా విధించింది. విచారణ అనంతరం నిందితులపై నేరం రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com