ఒమన్‌లో 28 మంది ఆసియన్లు అరెస్ట్..!!
- July 30, 2026
మస్కట్: ఒమన్‌లోకి సముద్ర మార్గం ద్వారా అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 28 మంది ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమాన్ పోలీసులు (ROP) తెలిపారు.
అల్ సీబ్ విలాయత్ తీరానికి సమీపంలో కోస్ట్ గార్డ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా.. ఓ పడవలో ప్రయాణిస్తున్న ఈ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరు అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించి వెంటనే అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన వారిపై ప్రస్తుతం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.
దేశ భద్రత దృష్ట్యా ఒమాన్ తీరప్రాంతాల్లో కోస్ట్ గార్డ్ బృందాలు నిరంతరం సముద్ర గస్తీ నిర్వహిస్తూ, అక్రమ ప్రవేశాలు, మానవ అక్రమ రవాణా, ఇతర సముద్ర భద్రతా ఉల్లంఘనలను అడ్డుకుంటున్నాయని అధికారులు తెలిపారు. అనుమానాస్పద కదలికలు కనిపించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి ప్రజలు సహకరించాలని పోలీసులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







