120 డేస్ సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలి.. కువైట్‌లో కొత్త చట్టం..!!
- July 30, 2026
కువైట్ : కువైట్ ప్రభుత్వం భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ కెమెరాలు, నిఘా పరికరాలకు సంబంధించిన చట్టంలో సవరణలు చేసింది. చట్టం పరిధిలోకి వచ్చే అన్ని సంస్థలు సీసీటీవీ కెమెరాల రికార్డింగులను కనీసం 120 రోజుల పాటు నిరంతరంగా భద్రపరచడం తప్పనిసరి చేశారు.
కొత్త నిబంధనల ప్రకారం, 120 రోజుల తప్పనిసరి స్టోరేజ్ సమయంలో సీసీటీవీ రికార్డింగులను మార్చడం, తొలగించడం, చెరిపివేయడం లేదా ఏ విధంగానైనా ఎడిట్ చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
కొన్ని ఉల్లంఘనలకు సంబంధించి సెటిల్మెంట్ విధానం కూడా ప్రవేశపెట్టింది. ఉల్లంఘన నోటీసు అందుకున్న తర్వాత ఏడు పని రోజులలోపు సంబంధిత సంస్థలు సెటిల్మెంట్కు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత అధికారి ఆమోదిస్తే, ఆ కేసుకు సంబంధించిన క్రిమినల్ చర్యలు నిలిపివేయబడతాయి. అయితే చట్టంలోని కొన్ని తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలకు ఈ వెసులుబాటు వర్తించదు.
120 రోజుల గడువు పూర్తయిన తర్వాత, సంబంధిత సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా ఫుటేజీ రికార్డింగుల స్టోరేజీ విధానాన్ని అమలు చేసుకోవచ్చు. అయితే, అది సంబంధిత అధికార సంస్థ నిర్దేశించిన భద్రతా, నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







