మస్కట్‌లో అల్ జబల్ స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- July 31, 2026
మస్కట్: ఒమాన్ రాజధాని మస్కట్‌లోని అల్ జబల్ స్ట్రీట్ (అకాబత్ అల్ అమెరికాత్) ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మస్కట్ మున్సిపాలిటీ వెల్లడించింది. అల్ అమెరికాత్ నుంచి బౌషర్ వైపు వెళ్లే మార్గంలో రాయల్ ఒమాన్ పోలీసులతో కలిసి చేపడుతున్న మౌలిక సదుపాయాల నిర్వహణ పనుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రహదారి పక్కన ఉన్న రక్షణ గోడల సమీపంలోని వదులుగా ఉన్న రాళ్లను తొలగించి, ప్రయాణికుల భద్రతను మెరుగుపర్చడమే ఈ పనుల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ మార్గంలో పూర్తిస్థాయి ట్రాఫిక్ నిలిపివేత ఆగస్టు 1 (శనివారం) రాత్రి వరకు అమల్లో ఉంటుందని మున్సిపాలిటీ వెల్లడించింది. ఈ కాలంలో వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను వినియోగించాలని, రహదారి సూచికలను తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







