సౌదీలో 6,500కు పైగా బీఎండబ్ల్యూ కార్ల రీకాల్..!!
- July 31, 2026
రియాద్: అగ్ని ప్రమాదం సంభవించే ప్రమాదం ఉన్న లోపం గుర్తించడంతో 6,574 బీఎండబ్ల్యూ (BMW) కార్లను సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ రీకాల్ చేసింది.ఈ రీకాల్ 2023 నుంచి 2025 మోడల్ సంవత్సరాలకు చెందిన BMW 5 సిరీస్, BMW 7 సిరీస్ వాహనాలకు వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. డ్రైవర్ సీటులోని వైరింగ్ హార్నెస్లో లోపం కారణంగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి, పొగ రావడం లేదా వాహనంలో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
వాహన యజమానులు తమ వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (VIN) ద్వారా తమ కారు రీకాల్ పరిధిలో ఉందో లేదో Recalls.sa వెబ్సైట్లో తనిఖీ చేసుకోవాలని సూచించారు. రీకాల్ పరిధిలో ఉన్న వాహనాల యజమానులు మొహమ్మద్ యూసుఫ్ నాగి కంపెనీని సంప్రదించి, అవసరమైన మరమ్మతులను ఉచితంగా చేయించుకోవాలని సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







