మహాత్ముడుకి మరణం ఉంది కాని ఆయన త్యాగానికి మరణం లేదు..
- August 15, 2016
గాంధీ హత్యకు గురైన తరువాత విశ్వవిఖ్యాత సైంటిస్ట్ ఐన్ స్టీన్ మాట్లాడుతూ 'ఇంతటి మహావ్యక్తి' ఈ భూమిమీద నడిచాడా ? మన మధ్య జీవించాడా ? అన్న సందేహం అందరికీ కలుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేసారు. అటువంటి మహాత్మాగాంధీని ప్రతి స్వాతంత్ర దినోత్సవంనాడు స్మరించుకోవడం పరిపాటి అయినా గాంధీ జీవితంలోని కొన్ని విశేషాలు తెలుసుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయాలుగానే ఉంటాయి.మహాత్మాగాంధీ 5 సార్లు నోబుల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేయబడినా ఆయనకు 'నోబుల్ ప్రైజ్' రాలేదు. గాంధీ తన జీవిత కాలంలో రోజుకు 18 కిలోమీటర్లు నడుస్తూ దేశం యావత్తు ప్రయాణించారు. ఆయన జీవితకాలంలో నడిచిన దూరాన్ని లెక్కిస్తే అది ఒక వ్యక్తి ప్రపంచాన్ని చుట్టి వచ్చినంత దూరం.ఆపిల్ కంపెనీ సీఈవో స్టీవ్ జాబ్స్ మహాత్మాగాంధీ వీరాభిమాని వీరాభిమాని మాత్రమే కాకుండా గాంధీ పెట్టుకున్న కళ్ళజోడు లాంటి కళ్ళజోడుని ఆయన పెట్టుకోవడమే కాకుండా మహాత్మాగాంధీ నిలువెత్తు ఫోటోను ఆయన ఆఫీసులో పెట్టుకున్నారు అంటే మహాత్ముడుకి స్టీవ్ జాబ్స్ ఎంత విలువ ఇచ్చాడో అర్ధం అవుతుంది. బ్రిటీష్ వారి పై పోరాటం చేసిన మహాత్మాగాంధీ ఇంగ్లాండ్ నుంచి మనకు సంక్రమించిన క్రికెట్ అంటే గాంధీకి ఎంతో అయిష్టత.
మన దేశంలో దాదాపు 50కి పైగా ప్రధాన రహదార్లులతో పాటు విదేశాలలో కూడ గాంధీ పేరున రహదార్లు ఉన్నాయి అంటే అ గొప్ప తనం ఒక్క జాతిపితకు మాత్రమే చెల్లింది. మన దేశంలో గాంధీ విగ్రహం లేని ఒక్క పల్లె కూడ ఉండదు అన్నది నమ్మలేని నిజం.
టాల్ స్టాయ్ ఐన్ స్టీన్ వంటి శాత్రవేత్తలతో ఎన్నో వైజ్ఞానిక విషయాల పై పెద్దపెద్ద ఉత్తరాలు తన స్వదస్తూరితో వ్రాసిన విషయం చాల మందికి తెలియదు. పిస్తోలుతో మహాత్మాగాంధీని గుండెలలో కాల్చినా ఆయన ఎవర్ని ద్వేషించకుండా హే రామ్ అంటూ నెల పై ఒరిగిపోయాడు అంటే అంతటి గొప్పతనం గాంధీ సొంతం .అలాంటి మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఈమధ్య విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉందని కొందరు అధికారులు ఆ విగ్రహాన్ని తొలగించి బుడమేరు మురికి కాలువలో పడేసారు అంటే జాతిపితకు ఈ 70 ఏళ్ళ స్వాతంత్ర చరిత్రలో ఎటువంటి గౌరవాన్ని ఇస్తున్నారు అన్నది అందరికీ అర్ధం అవుతుంది. అయితే మహాత్ముడుకి మరణం ఉంది కాని ఆయన త్యాగానికి మరణం లేదు..
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







