కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- July 31, 2026
కువైట్: రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ట్రాఫిక్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) కొత్త స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. ట్రాఫిక్ సిగ్నల్ రంగు మారే ముందు లైట్లు బ్లింక్ అయ్యే విధంగా రూపొందించిన ఈ వ్యవస్థను ప్రస్తుతం 40 కూడళ్లలో అమలు చేశారు. త్వరలో దశలవారీగా దేశవ్యాప్తంగా అన్ని గవర్నరేట్లకు విస్తరించనున్నారు.
మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బ్లింకింగ్ హెచ్చరికల ద్వారా కూడళ్లకు చేరుకునే వాహనదారులు ముందుగానే అప్రమత్తమై వేగాన్ని నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. దీంతో అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితులు తగ్గడంతో పాటు, వెనుక నుంచి ఢీకొనే ప్రమాదాలు, రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలు తగ్గి ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్టు కువైట్‌లో ట్రాఫిక్ మౌలిక సదుపాయాల ఆధునీకరణలో భాగమని, రహదారి భద్రతను మెరుగుపర్చేందుకు స్మార్ట్ టెక్నాలజీ, కృత్రిమ మేధ (AI) ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలను ఈ ఏడాది ప్రారంభం నుంచే విస్తృతంగా వినియోగిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అలాగే, వాహనదారులు నిర్దేశిత వేగ పరిమితులను పాటించాలని, ట్రాఫిక్ సిగ్నళ్లు, రహదారి సూచికలను గౌరవించాలని, సిగ్నల్ మారబోతున్న సమయంలో కూడళ్లను దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారానే ప్రాణాలు, ఆస్తులను రక్షించవచ్చని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







