ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- August 01, 2026
మస్కట్: ఒమాన్‌లోని పర్యాటక, ఆతిథ్య రంగ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కస్టమర్ల నుంచి వసూలు చేసే 8 శాతం సర్వీస్ ఛార్జీని పూర్తిగా ఉద్యోగులకే నగదు రూపంలో పంపిణీ చేయాలని పర్యాటక వారసత్వ మంత్రిత్వ శాఖ (Ministry of Heritage and Tourism) ఆదేశాలు జారీ చేసింది. టూరిజం చట్టం అమలు నిబంధనలలోని ఆర్టికల్-29 ప్రకారం జారీ చేసిన ఈ సర్క్యులర్ జూలై 30నుంచి అమల్లోకి వచ్చింది. ఒమన్‌లోని అన్ని లైసెన్స్ పొందిన పర్యాటక, హాస్పిటాలిటీ సంస్థలు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.
నూతన మార్గదర్శకాల ప్రకారం.. హోటళ్లు, రిసార్టులు, ఇతర పర్యాటక సంస్థలు వినియోగదారులు చెల్లించే బిల్లుపై 8 శాతం సర్వీస్ ఛార్జీ వసూలు చేయాలి. ఈ మొత్తాన్ని సంస్థ ఆదాయంగా పరిగణించకూడదని, ఇతర అవసరాలకు వినియోగించకూడదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వసూలు చేసిన మొత్తం సర్వీస్ ఛార్జీని ప్రతి నెల ఉద్యోగులందరికీ నగదు రూపంలో పంపిణీ చేయాలని ఆదేశించింది. పంపిణీకి సంబంధించిన రికార్డులు, ఆర్థిక పత్రాలను సంస్థలు తప్పనిసరిగా భద్రపరచాలని సూచించింది.
అంతేకాకుండా, మొత్తం ఎంత సర్వీస్ ఛార్జీ వసూలు చేశారో, ఎంత మొత్తాన్ని ఉద్యోగులకు పంపిణీ చేశారో, లబ్ధిదారుల వివరాలతో కూడిన నివేదికను సిద్ధం చేసి సంబంధిత ఆర్థిక పత్రాలతో పాటు మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల డైరెక్టరేట్‌కు ప్రతిని సమర్పించాలని ఆదేశించింది. సర్వీస్ ఛార్జీల పంపిణీపై అధికారిక నియంత్రణ మార్గదర్శకాలు విడుదలయ్యే వరకు ఈ సర్క్యులర్ అమల్లో ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి







