సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- August 01, 2026
రియాద్:సౌదీ అరేబియాలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నాన్ని జకాత్, ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ (ZATCA) అధికారులు భగ్నం చేశారు. అల్ హదీథా సరిహద్దు చెక్‌పోస్ట్ ద్వారా రాజ్యంలోకి ప్రవేశిస్తున్న ఓ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 36,773 యాంఫెటమైన్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ZATCA అధికార ప్రతినిధి హమ్మూద్ అల్-హర్బీ వివరాలను వెల్లడించారు. భద్రతా స్కానింగ్ పరికరాలు, ప్రత్యేక తనిఖీల ద్వారా బస్సును పరిశీలించగా, వాహనం కింది భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన రహస్య అరలో ఈ పిల్స్ ను దాచినట్లు గుర్తించారు.
సరిహద్దు ప్రాంతాల్లో స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కస్టమ్స్ తనిఖీలను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని, ఈ విషయంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ తో సమన్వయంగా పనిచేస్తున్నామని అల్-హర్బీ తెలిపారు.
అక్రమ రవాణాపై సమాచారం ఉన్నవారు 1910 హెల్ప్‌లైన్, [[email protected]](mailto:[email protected]) ఈమెయిల్ లేదా +966 11 910 అంతర్జాతీయ నంబర్ ద్వారా సమాచారం అందించాలని జాట్కా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు, కేసు నిర్ధారణకు దారితీసే సమాచారం అందించిన వారికి నగదు బహుమతి కూడా అందజేస్తామని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు
- డాలస్ లో వైభంవగా కొసరాజు సాహిత్యావిష్కరణ
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!







