దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- August 01, 2026
దుబాయ్: మత్తు పదార్థాల ప్రభావంలో కారు నడుపుతూ పడవ, మరో వాహనాన్ని ఢీకొట్టి ఆస్తి నష్టం కలిగించిన ఓ ఆసియా దేశానికి చెందిన డ్రైవర్‌కు దుబాయ్ ట్రాఫిక్ కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. అలాగే అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది.
కోర్టు వివరాల ప్రకారం.. అల్ ఖుసైస్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడు నిర్లక్ష్యంగా రివర్స్ తీస్తూ ఇంటి పక్కన పార్క్ చేసి ఉన్న పడవను ఢీకొట్టడంతో పాటు మరో వాహనానికి కూడా నష్టం కలిగించాడు. ఘటనాస్థలిలో డ్రైవర్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు తనిఖీ నిర్వహించగా, అతని పర్సులో క్రిస్టల్ మెత్ (మెథాంఫెటమైన్) ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఫోరెన్సిక్ పరీక్షల్లో అది నిషేధిత మత్తు పదార్థమేనని నిర్ధారణ అయింది.
విచారణలో నిందితుడు ప్రమాదం జరిగిన రోజే క్రిస్టల్ మెత్ సేవించి వాహనం నడిపినట్లు అంగీకరించాడు. తన వద్ద లభ్యమైన మత్తు పదార్థం వ్యక్తిగత వినియోగం కోసమేనని, నిర్లక్ష్యంగా రివర్స్ తీస్తూ ప్రమాదానికి కారణమైనట్లు కూడా ఒప్పుకున్నాడు. పోలీసుల నివేదిక, ఫోరెన్సిక్ పరీక్షల ఫలితాలు, నిందితుడి ఒప్పుకోలు ఆధారంగా అతను మత్తు పదార్థాల వినియోగం, వ్యక్తిగత వినియోగం కోసం డ్రగ్స్ కలిగి ఉండటం, మత్తులో వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఇతరుల ఆస్తికి నష్టం కలిగించడం వంటి నేరాలకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. అన్ని నేరాలు ఒకే ఘటనకు సంబంధించినవిగా భావించిన కోర్టు.. చట్టం ప్రకారం వర్తించే అత్యంత కఠిన శిక్షను విధిస్తూ జైలు శిక్ష, జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







