దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి

- August 01, 2026 , by Maagulf
దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా (నిమ్స్ డై) ఘోరమైన హిమపాతంలో చిక్కుకుని కన్నుమూశారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లోని కారాకోరం పర్వత శ్రేణుల్లో ఉన్న ప్రపంచంలోనే 12వ అత్యంత ఎత్తైన ‘బ్రాడ్ పీక్’ (Broad Peak – 8,051 మీటర్లు) పర్వతాన్ని అధిరోహిస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పర్వతారోహణ చేస్తుండగా అకస్మాత్తుగా భారీగా మంచు కొండచరియలు విరిగిపడటంతో నిర్మల్ పుర్జాతో పాటు ఆయన బృందంలోని పలువురు క్లైంబర్లు మిస్సయ్యారు. శనివారం నాటికి సాగించిన సుదీర్ఘ గాలింపు చర్యల్లో పుర్జా పార్థివదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. మిగిలిన మిస్సయిన సభ్యుల కోసం దళాలు ఇంకా తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ఆర్మీ నౌకాదళం నుంచి రికార్డుల పర్వతారోహకుడిగా..నేపాల్‌లో జన్మించిన నిర్మల్ పుర్జా

బ్రిటీష్ మిలిటరీలోని రాయల్ మెరైన్స్, స్పెషల్ బోట్ సర్వీస్ (SBS) విభాగాలు మరియు గూర్ఖా దళాల్లో సుదీర్ఘకాలం సేవలు అందించి రిటైరయ్యారు. పర్వతారోహణ రంగంలో ఆయన సృష్టించిన రికార్డులు అసాధారణమైనవి. ప్రపంచంలోని 8,000 మీటర్ల కంటే ఎత్తైన 14 శిఖరాలను అత్యంత వేగంగా (కేవలం 6 నెలల 6 రోజుల్లో) అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆయన సాధించిన ఈ రికార్డు ఆధారంగా నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన “14 Peaks: Nothing Is Impossible” అనే డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రజాదరణ పొందింది. సాహసానికి నిలువెత్తు రూపంగా నిలిచిన పుర్జా అకస్మాత్తుగా మరణించడంతో ప్రపంచ పర్వతారోహణ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com