రియాద్‌లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- August 01, 2026
రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాల రాకపోకలను మరింత సులభతరం చేయడానికి తాయిఫ్ రోడ్ అభివృద్ధి ప్రాజెక్టు కొత్త దశను రాయల్ కమిషన్ ఫర్ రియాద్ సిటీ (RCRC) ప్రారంభించింది. ఈ దశలో భాగంగా తాయిఫ్ రోడ్–తైబా స్ట్రీట్ కూడలిలో 311 మీటర్ల పొడవు, 36 మీటర్ల వెడల్పుతో భారీ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పశ్చిమాన తాయిఫ్ రోడ్–నజ్ద్ స్ట్రీట్ కూడలి నుంచి తూర్పున వెస్ట్రన్ రింగ్ రోడ్ వరకు విస్తరించనుంది.
మొత్తం 15 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో రెండు దిశల్లోనూ నాలుగు ప్రధాన లేన్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో ట్రాఫిక్ సామర్థ్యం రోజుకు సుమారు 2 లక్షల వాహనాలకు పెరగనుండగా, ప్రయాణ సమయం తగ్గడంతో పాటు భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలను కూడా తీర్చేలా ప్రణాళిక రూపొందించారు.
నిర్మాణ పనుల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలతో కలిసి ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు RCRC తెలిపింది. ఇందులో భాగంగా జూలై 31 నుంచి తాయిఫ్ రోడ్–తైబా స్ట్రీట్ కూడలిలో రెండు వైపులా తాత్కాలికంగా మూడు లేన్ల మళ్లింపు మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అలాగే, ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యామ్నాయ మార్గాలపై తాజా సమాచారాన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, నావిగేషన్ యాప్‌ల ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







