బాక్సింగ్‌లో ఏకంగా 7 స్వర్ణాలు సాధించిన భారత్!

- August 02, 2026 , by Maagulf
బాక్సింగ్‌లో ఏకంగా 7 స్వర్ణాలు సాధించిన భారత్!

గ్లాస్గో: స్కాలాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 (CWG 2026)లో భారత బాక్సర్లు ఊహించని రీతిలో చెలరేగిపోయారు. ఒకే టోర్నీలో 7 స్వర్ణాలు, 3 రజతాలు సాధించి బాక్సింగ్ విభాగంలో భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది. ఫైనల్ చేరుకున్న 10 మంది బాక్సర్లు పతకాలు సాధించడం విశేషం. ఈ రికార్డు ప్రదర్శనతో బాక్సింగ్ పాయింట్ల పట్టికలో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది.

స్వర్ణాలు సాధించిన విజేతలు

మహిళల విభాగంలో (5 స్వర్ణాలు):
ప్రీతి పవార్ (54 కేజీల విభాగం)
జైస్మిన్ లాంబోరియా (57 కేజీల విభాగం)
సాక్షి చౌదరి (51 కేజీల విభాగం)
ప్రియ ఘంగాస్ (60 కేజీల విభాగం)
అరుంధతి చౌదరి (70 కేజీల విభాగం)
పురుషుల విభాగంలో (2 స్వర్ణాలు):
సచిన్ సివాచ్ (60 కేజీల విభాగం)
అంకుష్ పంగాల్ (80 కేజీల విభాగం)
CWG Glasgow 2026: 🇮🇳 పాయింట్ల పట్టికలో దూసుకెళ్తున్న భారత్

బాక్సర్ల కనకవర్షంతో పాటు అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, జూడో విభాగాల్లోనూ పతకాలు రావడంతో భారత పతకాల సంఖ్య 39కి చేరింది. దీంతో కామన్వెల్త్ గేమ్స్ పాయింట్ల పట్టికలో భారత్ ఓవర్ ఆల్‌గా 4వ స్థానానికి చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com