జలీబ్‌లో ఉక్కుపాదం.. 1,253 మంది అరెస్ట్..!!
- August 02, 2026
కువైట్ : జలీబ్ అల్-షుయూఖ్ ప్రాంతంలో కొనసాగుతున్న భారీ భద్రతా తనిఖీల్లో మరోసారి పెద్ద ఎత్తున అక్రమాలపై చర్యలు చేపట్టినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా దాడుల్లో భద్రతా కేసులు, రెసిడెన్సీ, కార్మిక చట్టాల ఉల్లంఘనలకు పాల్పడిన 1,253 మందిని అరెస్టు చేసినట్లు తెలిపింది. అలాగే మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణా, వినియోగానికి సంబంధించి 16 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది.
మొదటి ఉప ప్రధాని, హోం మంత్రి షేక్ ఫహద్ అల్-యూసుఫ్ ఆదేశాల మేరకు, అండర్‌సెక్రటరీ మేజర్ జనరల్ అబ్దుల్‌వహాబ్ అల్-వాహిబ్ పర్యవేక్షణలో ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ ప్రత్యేక భద్రతా ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. జలీబ్ ప్రాంతంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న అక్రమాలను అరికట్టడం, ప్రజా భద్రతను బలోపేతం చేయడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.
ఇప్పటికే జరిగిన దశల వారీ దాడుల్లో అక్రమ నివాసాలను ఖాళీ చేయించడంతో పాటు రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన అనేక మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఖాళీ చేసిన భవనాలను తిరిగి అక్రమంగా ఆక్రమించకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రత్యేక భద్రతా తనిఖీలను దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని వెల్లడించారు.
పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ 6,511 తనిఖీలు నిర్వహించి, 1,471 సంస్థలు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించింది. అలాగే 376 మంది కార్మికులను తనిఖీ చేసి, అక్రమ వసతి చెల్లింపులకు సంబంధించిన 129 కేసులను గుర్తించింది. వలస కార్మికుల ఆశ్రయ కేంద్రం నుంచి 110 మందిని డిపోర్టేషన్ విభాగానికి తరలించింది. జలీబ్ అల్-షుయూఖ్‌తో పాటు ఇలాంటి అక్రమాలు ఉన్న ఇతర ప్రాంతాల్లో కూడా తనిఖీలు కొనసాగుతాయని, ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బాక్సింగ్‌లో ఏకంగా 7 స్వర్ణాలు సాధించిన భారత్!
- జలీబ్‌లో ఉక్కుపాదం.. 1,253 మంది అరెస్ట్..!!
- ఒమాన్‌లో ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు..!!
- అమెరికాలో సౌదీ రక్షణ శాఖ సహాయ మంత్రి..కీలక చర్చలు..!!
- ఘనంగా ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు..
- నిబంధనల ఉల్లంఘన.. ట్రావెల్ ఏజెన్సీ మూసివేత..!!
- యూఏఈలో ఈ ఏడాది తొలిసారి 50°C నమోదు..!!
- ఆరు రోజుల్లోనే 38 వేల మంది సందర్శకులు..విశేష ఆదరణ..!!
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్‌స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..







