అమెరికాలో సౌదీ రక్షణ శాఖ సహాయ మంత్రి..కీలక చర్చలు..!!
- August 02, 2026
రియాద్: సౌదీ అరేబియా రక్షణ శాఖ కార్యనిర్వాహక వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ఖాలిద్ అల్-బియారి అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సైనిక పరిశ్రమలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, ప్రాంతీయ భద్రత అంశాలపై కీలక చర్చలు జరిపారు. పర్యటనలో భాగంగా ఆయన తొలుత అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ (DSCA) డైరెక్టర్ మేరీ మోర్గాన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ పరిశ్రమల్లో సహకారం, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అనంతరం పెంటగాన్‌లో అమెరికా అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఫర్ అక్విజిషన్ అండ్ సస్టైన్మెంట్ మైఖేల్ డఫీ, అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఫర్ పాలసీ ఎల్బ్రిడ్జ్ కోల్బీ, అండర్ సెక్రటరీ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ ఫర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ జెంట్రీ స్టీఫెన్ తో వేర్వేరుగా సమావేశమయ్యారు.
ఈ సమావేశాల్లో సౌదీ-అమెరికా రక్షణ సహకారాన్ని మరింత విస్తరించడం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి ప్రయోజనాలు మరియు ప్రాంతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిగాయి. అలాగే అమెరికా అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఆర్మ్స్ కంట్రోల్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ థామస్ డినానో తో కూడా అల్-బియారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సౌదీ-అమెరికా సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించడంలో ఇరు దేశాల పాత్రపై అభిప్రాయాలు పంచుకున్నారు. పర్యటన చివర్లో అమెరికాలోని ప్రముఖ రక్షణ సంస్థల సీఈవోలతో అల్-బియారి సమావేశమయ్యారు. సౌదీ విజన్-2030 లక్ష్యాలకు అనుగుణంగా రక్షణ పరిశ్రమలు, పరిశోధన-అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, స్థానికీకరణ (లోకలైజేషన్) రంగాల్లో సహకార అవకాశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







