ప్రయాణాలకు వెళ్లే ముందు విద్యుత్ పరికరాలు ఆఫ్ చేస్తున్నారా..!!
- August 03, 2026
కువైట్: ప్రయాణాలకు వెళ్లే ముందు ఇళ్లలో విద్యుత్, నీటి వినియోగాన్ని తగ్గించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కువైట్ విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. జాతీయ వనరుల పరిరక్షణతో పాటు విద్యుత్, నీటి వృథాను అరికట్టే లక్ష్యంతో నిర్వహిస్తున్న "సేవ్ (Save)" అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ సూచనలు జారీ చేసింది.
సెలవుల సమయంలో కుటుంబాలు ఇళ్లకు దూరంగా ఉండే నేపథ్యంలో ఇంటి నుంచి బయలుదేరే ముందు అవసరం లేని విద్యుత్ పరికరాలను ప్లగ్‌ల నుంచి తొలగించాలని సూచించింది. అలాగే అన్ని లైట్లు ఆఫ్ చేయడం, ఎయిర్ కండీషనర్‌ను 27 డిగ్రీల సెల్సియస్ వద్ద సెట్ చేయడం లేదా అవసరం లేకపోతే పూర్తిగా ఆఫ్ చేయడం, వాటర్ హీటర్‌ను నిలిపివేయడం, ఇంట్లోని నీటి పైపుల్లో లీకేజీలు ఉన్నాయో లేదో పరిశీలించడం వంటి చర్యలు తీసుకోవాలని తెలిపింది.
ఈ జాగ్రత్తలతో విద్యుత్, నీటి వినియోగం తగ్గడమే కాకుండా విద్యుత్ బిల్లులు తగ్గుతాయని, ఇల్లు ఖాళీగా ఉన్న సమయంలో భద్రత కూడా మెరుగుపడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా జాతీయ వనరుల పరిరక్షణకు తోడ్పడటంతో పాటు కువైట్ విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థల సామర్థ్యాన్ని పెంపొందించడంలో కూడా ఇవి దోహదపడతాయని వెల్లడించింది. ప్రజల్లో బాధ్యతాయుత వినియోగంపై అవగాహన కల్పించే "సేవ్" ప్రచారాన్ని కొనసాగిస్తామని, విద్యుత్, నీటి వంటి విలువైన జాతీయ వనరులను పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు
- డాలస్ లో వైభంవగా కొసరాజు సాహిత్యావిష్కరణ
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!







