కావేరి జలాల వివాదం.. సీఎం విజయ్ ముందున్న తొలి రాజకీయ సవాల్
- August 03, 2026
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సి. జోసెఫ్ విజయ్‌కు మొదటిసారీ పెద్ద రాజకీయ పరీక్ష ఎదురైంది. దశాబ్దాలుగా ముగింపు లేని కావేరి జలాల పంపిణీ సమస్యపై ఆయన సర్కార్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ సున్నితమైన అంశంపై చర్చించే నిమిత్తం తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా, విజయ్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అఖిలపక్ష సమావేశం డిమాండ్‌ను తోసిపుచ్చిన టీవీకే ప్రభుత్వం
కావేరి అంశంపై వెంటనే అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షం డీఎంకేతో పాటు ఇతర పార్టీలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నాయి. అయితే, టీవీగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం ఈ డిమాండ్‌ను సున్నితంగా తిరస్కరించింది. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నాయని మండిపడింది.
డీఎంకే కుట్రపూరిత రాజకీయమే – టీవీకే నేత సీటీఆర్ నిర్మల్ కుమార్ విమర్శలు
ఈ వివాదంపై టీవీకే సీనియర్ నేత సీటీఆర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ.. “ఇప్పటికే శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల సంపూర్ణ మద్దతుతో ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. అలాంటప్పుడు మళ్లీ అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏముంది? కేవలం మా ముఖ్యమంత్రికి కావాలనే ఇబ్బందులు సృష్టించాలనే కుట్రతోనే డీఎంకే ఇలా వ్యవహరిస్తోంది తప్ప, వారికి తమిళనాడు సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదు” అని ధ్వజమెత్తారు.
కర్ణాటక పర్యటన రద్దు – నేడు తంజావూరులో డీఎంకే భారీ నిరసన
గతంలో కావేరి ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో నాటి ప్రభుత్వాలు అఖిలపక్ష భేటీలను ఏర్పాటు చేశాయి. కానీ ప్రస్తుత టీవీకే ప్రభుత్వం మాత్రం వినూత్న వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం నేరుగా బెంగళూరు వెళ్లి కర్ణాటక ముఖ్యమంత్రితో చర్చలు జరపాలని సీఎం విజయ్ ప్లాన్ చేసినప్పటికీ, అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆ టూర్ రద్దయినట్లు సమాచారం. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు తంజావూరు వేదికగా రైతుల సమస్యలు, కావేరి జలాల అంశంపై భారీ నిరసన ప్రదర్శన చేపట్టాలని డీఎంకే నిర్ణయించింది.
తాజా వార్తలు
- సలాలాలో ఒమన్-బహ్రెయిన్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఎగ్జిబిషన్ సెంటర్లో 'ఈడబ్ల్యూబీ కలినేర్' సేవలు..!!
- కావేరి జలాల వివాదం.. సీఎం విజయ్ ముందున్న తొలి రాజకీయ సవాల్
- 2026 తొలి ఆరు నెలల్లో ఒమన్‌లో తగ్గిన జననాలు, మరణాలు..!!
- అట్టహాసంగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్!
- 75 రోజుల పాటు బురైదా అంతర్జాతీయ డేట్స్ ఫెస్టివల్..!!
- గాలిలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు..ఇద్దరు పైలట్లు మృతి
- మెట్రాష్ యాప్‌తో సీఐడీకి గోప్యంగా సమాచారం అందించే అవకాశం..!!
- భారత్ లో ఒక్కో యూజర్ నెలకు 50 గంటలు ఇన్స్టాలోనే!
- సెప్టెంబర్‌లో రోజుకు 1.88 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంపు..!!







