2026 తొలి ఆరు నెలల్లో ఒమన్‌లో తగ్గిన జననాలు, మరణాలు..!!
- August 03, 2026
మస్కట్: ఒమన్‌లో 2026 తొలి ఆరు నెలల్లో జననాలు, మరణాల సంఖ్య రెండూ తగ్గినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే జననాలు 1.7 శాతం, మరణాలు 7.3 శాతం తగ్గినట్లు ఒమన్ నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) వెల్లడించింది. గణాంకాల ప్రకారం జూన్ చివరి నాటికి ఒమన్‌లో మొత్తం 32,405 మంది శిశువులు జన్మించారు. వీరిలో 28,828 మంది ఒమన్ పౌరుల కుటుంబాల్లో, 3,577 మంది ప్రవాస కుటుంబాల్లో జన్మించారు. ఇక ఒమన్ పౌరుల జననాల్లో 14,793 మంది బాలురు, 14,035 మంది బాలికలు ఉన్నారు. ప్రవాస కుటుంబాల్లో జన్మించిన వారిలో 1,847 మంది బాలురు, 1,730 మంది బాలికలు ఉన్నారు.
జూన్ నెలలో మాత్రమే ఒమన్‌లో 5,560 జననాలు నమోదయ్యాయి. మే నెలలో నమోదైన 5,665 జననాలతో పోలిస్తే ఈ సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఒమన్ మహిళల్లో జననాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే అత్యధికంగా 3.7 శాతం తగ్గింది. ఒమన్ పురుషుల జననాల్లో మాత్రం 0.3 శాతం పెరుగుదల నమోదైంది. ప్రవాసుల్లో జననాలు 2 శాతం తగ్గాయి.
మరోవైపు దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. జూన్ చివరి నాటికి మొత్తం 4,590 మరణాలు నమోదయ్యాయి. ఇది 2025తో పోలిస్తే 7.3 శాతం తక్కువ. ఒమన్ పౌరుల్లో మరణాలు 6.6 శాతం తగ్గి 3,646కు చేరుకున్నాయి. ఇందులో 2,106 మంది పురుషులు, 1,540 మంది మహిళలు ఉన్నారు. ప్రవాసుల్లో మరణాలు 9.9 శాతం తగ్గి 944కు చేరాయి. జూన్ నెలలో 736 మరణాలు నమోదయ్యాయి. ఇందులో 590 మంది ఒమన్ పౌరులు, 146 మంది ప్రవాసులు ఉన్నారు.
మహిళల మరణాల సంఖ్య పురుషులతో పోలిస్తే ఎక్కువగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒమన్ మహిళల్లో మరణాలు 10.6 శాతం, పురుషుల్లో 3.8 శాతం తగ్గాయి. ప్రవాస మహిళల్లో మరణాలు 16.7 శాతం, పురుషుల్లో 8.3 శాతం తగ్గాయి. ఈ గణాంకాలు తాత్కాలికమైనవని, ఒమన్ వెలుపల చోటుచేసుకున్న జననాలు, మరణాలను ఇందులో చేర్చలేదని NCSI స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో క్లాస్జెన్ ఐ డ్రాప్స్ రీకాల్..!!
- బహ్రెయిన్ పాఠశాలల్లో పర్యావరణ పాఠాలు..!!
- యూఏఈలో వాహనాల కొనుగోలుపై కొత్త నిబంధనలు..!!
- భారత్ నుంచి పేపర్ దిగుమతులపై GCC యాంటీ డంపింగ్ విచారణ..!!
- ఒమన్‌లో ‘ముసందమ్ వింటర్ 2026-2027’కు శ్రీకారం..!!
- కువైట్‌లో ప్రాపర్టీ యజమానులకు హోంశాఖ హెచ్చరిక..!!
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు







