కలిసిన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు
- August 15, 2016
సుదీర్ఘ కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఒకే వేదిక మీద కలిశారు. రాజ్‌భవన్‌లో రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నిర్వహించిన 'ఎట్ హోం' కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు చంద్రులను ఒకే వేదికమీద చూడటంతో తనకు ఇది నిండుపున్నమిలా కనపడుతోందని గవర్నర్ నరసింహన్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు రెండు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు కోడెల శివప్రసాదరావు, మధుసూదనాచారి, మండలి చైర్మన్లు చక్రపాణి, స్వామిగౌడ్, పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు కరచాలనం చేశారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







