కువైట్‌లో బ్యాంక్ కార్డుల వినియోగం జోరు..!!
- August 04, 2026
కువైట్ : కువైట్‌లో స్థానిక బ్యాంకులు జారీ చేసిన చెల్లుబాటు అయ్యే బ్యాంక్ కార్డుల సంఖ్య 2026 జూన్ చివరి నాటికి 7.963 మిలియన్లకు చేరిందని కువైట్ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.
సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2026 తొలి ఆరు నెలల్లో స్థానిక బ్యాంకులు మరో 3.96 లక్షల (396,200) కొత్త కార్డులను జారీ చేశాయి. దీంతో 2025 చివర్లో నమోదైన 75.66 లక్షల కార్డులతో పోలిస్తే 5.23 శాతం వృద్ధి నమోదైంది.
పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) అంచనా ప్రకారం ప్రస్తుతం కువైట్ జనాభా 5.31 మిలియన్లు. ఈ లెక్కన ప్రతి 100 మంది నివాసితులకు సగటున 150 బ్యాంక్ కార్డులు ఉన్నట్లు తెలుస్తోంది.
డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డులు వంటి పలు బ్యాంకింగ్ ఉత్పత్తులను ప్రజలు విస్తృతంగా వినియోగిస్తున్నారని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. దేశంలో డిజిటల్ చెల్లింపులు, ఆధునిక బ్యాంకింగ్ సేవల వినియోగం వేగంగా పెరుగుతోందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







