మస్కట్‌లో అల్ అమెరికాత్ ఓవర్‌పాస్ తాత్కాలికంగా మూసివేత..!!

- August 06, 2026 , by Maagulf
మస్కట్‌లో అల్ అమెరికాత్ ఓవర్‌పాస్ తాత్కాలికంగా మూసివేత..!!

మస్కట్: ఒమాన్ రాజధాని మస్కట్‌లోని అల్ జబల్ స్ట్రీట్ (అల్ అమెరికాత్ ఓవర్‌పాస్)పై బౌషర్ విలాయత్ నుంచి అల్ అమెరికాత్ విలాయత్‌కు వెళ్లే మార్గాన్ని తాత్కాలికంగా పూర్తిగా మూసివేస్తున్నట్లు మస్కట్ మున్సిపాలిటీ ప్రకటించింది. రాయల్ ఒమాన్ పోలీస్ సమన్వయంతో ఈ నిర్ణయాన్నితీసుకున్నట్టు తెలిపింది.

రహదారిపై కొనసాగుతున్న మౌలిక వసతుల నిర్వహణ పనుల్లో భాగంగా కొండచరియల నుంచి పడిపోయిన రాళ్లను తొలగించడం, రహదారిని పూర్తిగా సురక్షితంగా మార్చడం కోసం ఈ మార్గాన్ని మూసివేయాల్సి వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిర్వహణ పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని మస్కట్ మున్సిపాలిటీ సూచించింది. అలాగే ట్రాఫిక్ సూచనలు, అధికారుల మార్గదర్శకాలను పాటిస్తూ ప్రయాణించాలని విజ్ఞప్తి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com