ఎలక్ట్రానిక్ ఆర్ట్స్‌ను కొనుగోలు చేసిన సౌదీ నేతృత్వంలోని కన్సార్టియం..!!
- August 08, 2026
కాలిఫోర్నియా: సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF) నేతృత్వంలోని కన్సార్టియం ప్రపంచ ప్రఖ్యాత వీడియో గేమింగ్ సంస్థ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ (EA) కొనుగోలును విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద గేమింగ్ కంపెనీల్లో ఒకటైన EA ఇకపై ప్రైవేట్ యాజమాన్యంలోకి వెళ్లింది. సౌదీ అరేబియా గ్లోబల్ గేమింగ్ రంగంలో తన ఆధిపత్యాన్ని పెంచుకునే వ్యూహంలో ఇది కీలక మైలురాయిగా నిలిచింది. 2025 సెప్టెంబర్‌లో ప్రకటించిన ఈ ఒప్పందానికి అదే ఏడాది డిసెంబర్‌లో EA వాటాదారులు ఆమోదం తెలపగా, తాజాగా అధికారికంగా కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి షేరుకు 210 డాలర్లు నగదు చెల్లించనుండగా, EA షేర్లను నాస్‌డాక్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి తొలగించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన EA SPORTS FC, Madden NFL, Battlefield, The Sims, Apex Legends, Need for Speed, Dragon Age, Mass Effect వంటి ప్రముఖ గేమ్‌లను EA అభివృద్ధి చేసింది. EA ఛైర్మన్, సీఈఓ ఆండ్రూ విల్సన్ మాట్లాడుతూ.. కొత్త భాగస్వాములతో సంస్థ మరింత బలోపేతమవుతుందని, గేమింగ్ రంగంలో కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడతామని తెలిపారు.
PIF డిప్యూటీ గవర్నర్ టుర్కీ అల్‌నౌవైజర్ మాట్లాడుతూ..వినోదం, క్రీడలు తమ వ్యూహాత్మక పెట్టుబడుల్లో కీలక రంగాలని, EAతో కలిసి దీర్ఘకాలిక వృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. అలాగే ఏఐ వినియోగాన్ని విస్తరించి గేమ్ అభివృద్ధి, ఆటగాళ్ల అనుభవాన్ని మరింత మెరుగుపరచాలని కన్సార్టియం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
గేమింగ్ హబ్‌గా సౌదీ లక్ష్యం
ఈ కొనుగోలు సౌదీ అరేబియా జాతీయ గేమింగ్, ఈ-స్పోర్ట్స్ వ్యూహానికి అనుగుణంగా జరిగింది. గేమింగ్ రంగాన్ని ఆర్థిక వైవిధ్యీకరణ, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ప్రధాన వేదికగా సౌదీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో 23.5 మిలియన్ కోట్లకు పైగా గేమర్లు ఉండగా, ఇది దేశ జనాభాలో దాదాపు 67 శాతం. జాతీయ గేమింగ్, ఈ-స్పోర్ట్స్ వ్యూహం ద్వారా దేశ జీడీపీకి 50 బిలియన్ సౌదీ రియాల్స్‌కు పైగా తోడ్పాటు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
అలాగే PIFకు చెందిన సావీ గేమ్స్ గ్రూప్ (Savvy Games Group) ప్రపంచ గేమింగ్ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతూ, ఈ-స్పోర్ట్స్ అభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలు, అంతర్జాతీయ టోర్నమెంట్‌ల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తోంది. రియాద్‌లో నిర్వహించిన 2025 ఈ-స్పోర్ట్స్ వరల్డ్ కప్ ప్రపంచవ్యాప్తంగా 175కి పైగా దేశాల్లో 75 కోట్ల వీక్షణలు నమోదు చేసి సౌదీ గేమింగ్ రంగం అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ప్రభావాన్ని చాటిచెప్పింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







