రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి
- September 22, 2026
రాస్ అల్ ఖైమా: రాస్ అల్ ఖైమా రూలర్, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ సౌద్ బిన్ సఖర్ అల్ ఖాసిమీని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ ఎమ్మాడి విష్ణువర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
రాస్ అల్ ఖైమాలోని సఖర్ బిన్ మహమ్మద్ సిటీలో ఉన్న పాలకుడి ప్యాలెస్‌లో ఈ భేటీ జరిగింది. దుబాయ్, ఉత్తర ఎమిరేట్స్‌కు భారత కాన్సుల్ జనరల్‌గా నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి షేక్ సౌద్ బిన్ సఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా షేక్ సౌద్ బిన్ సఖర్ అల్ ఖాసిమీ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డికి స్వాగతం పలికి, నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.
యూఏఈ, భారత్ మధ్య వివిధ రంగాల్లో కొనసాగుతున్న సహకారాన్ని మరింత బలోపేతం చేసేలా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. భారత్-యూఏఈ ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో పరస్పర సహకారం కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.


తాజా వార్తలు
- యూఏఈ నివాసితులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్..
- దీపావళి వేళ యాదగిరిగుట్ట ఆలయ వేళల్లో మార్పులు
- కువైట్‌లో చోరీకి గురైన 4WD వాహనం లభ్యం..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించారు..!!
- ఒమన్‌లో ఆసియాకు చెందిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లకు ఊరట..!!
- దుబాయ్‌లో ఫేక్ పటెక్ ఫిలిప్ వాచ్ విక్రయం.. మహిళకు Dh10,000 ఫైన్..!!
- సౌదీ అరేబియాలో జిమ్‌లు, స్పోర్ట్స్ సెంటర్లకు తుది గడువు..!!
- ఖతార్ గ్రాండ్ ప్రి.. నవంబర్ 28 నుంచి రేసింగ్ సందడి..!!







