కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- September 22, 2026
షార్జా: కల్బా నగరంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న అల్ ఫ్రైష్ సరస్సు (Al Freish Lake) ప్రాజెక్టు ప్రణాళికకు షార్జా సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, రూలర్ షేక్ డా.సుల్తాన్ బిన్ మహమ్మద్ అల్ ఖాసిమి ఆమోదం తెలిపారు.
సుమారు 51,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ సరస్సును అభివృద్ధి చేయనున్నారు. ఇందులో గరిష్ఠంగా 28 మిలియన్ గ్యాలన్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంటుంది. సందర్శకుల సౌకర్యార్థం సుమారు 200 కార్ల పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.
అల్ మార్ష్ స్క్వేర్ వెనుక భాగంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నట్లు షార్జా పాలకుడు తెలిపారు. సుమారు 750 మీటర్ల పొడవు ఉండే ఈ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాన్ని ఆహ్లాదకరమైన పార్కుగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.
పిల్లలకు ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉండేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నామని, ఇది అల్ రఫీసా డ్యామ్ ప్రాజెక్టు తరహాలో ఆహ్లాదకరమైన పర్యాటక, వినోద ప్రదేశంగా మారుతుందని షేక్ సుల్తాన్ తెలిపారు.
ప్రస్తుతం ఈ ప్రాంతంలోని పర్వతంపై చెట్లను నాటే పనులు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. చెట్ల మధ్య నుంచి జలపాతాలు ప్రవహిస్తూ సముద్రంలోకి చేరేలా సహజసిద్ధమైన వాతావరణాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
సందర్శకులు తమ వాహనాలను పార్క్ చేసి, చుట్టుపక్కల ప్రాంతాల్లో నడుచుకుంటూ ప్రకృతి అందాలను ఆస్వాదించేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు షార్జా పాలకుడు తెలిపారు.
అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టు పూర్తయిన అనంతరం కల్బా నగరంలో మరో ప్రముఖ వినోద, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడంతో పాటు స్థానికులకు, సందర్శకులకు ప్రకృతి మధ్య ఆహ్లాదకరమైన అనుభూతిని అందించనుంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసితులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్..
- దీపావళి వేళ యాదగిరిగుట్ట ఆలయ వేళల్లో మార్పులు
- కువైట్‌లో చోరీకి గురైన 4WD వాహనం లభ్యం..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించారు..!!
- ఒమన్‌లో ఆసియాకు చెందిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లకు ఊరట..!!
- దుబాయ్‌లో ఫేక్ పటెక్ ఫిలిప్ వాచ్ విక్రయం.. మహిళకు Dh10,000 ఫైన్..!!
- సౌదీ అరేబియాలో జిమ్‌లు, స్పోర్ట్స్ సెంటర్లకు తుది గడువు..!!
- ఖతార్ గ్రాండ్ ప్రి.. నవంబర్ 28 నుంచి రేసింగ్ సందడి..!!







