కువైట్‌లో ఫ్యామిలీ విజిట్ వీసా నిబంధనల్లో మార్పులు..!!
- August 08, 2026
కువైట్ : కువైట్‌లో కుటుంబ సభ్యుల కోసం జారీ చేసే ఫ్యామిలీ విజిట్ వీసాలను (Visit Visa) శాశ్వత ఆర్టికల్-22 (ఫ్యామిలీ/డిపెండెంట్) రెసిడెన్సీ గా మార్చుకునే నిబంధనలను అధికారులు వివరించారు. నెలకు కనీసం 800 కువైటీ దినార్లు (KD 800) వేతనం పొందుతున్న ప్రవాసులు, నిర్ణయించిన అర్హతలు పూర్తి చేస్తే తమ భార్య, 18 ఏళ్లలోపు కుమారులు, 21 ఏళ్లలోపు అవివాహిత కుమార్తెల విజిట్ వీసాలను రెసిడెన్సీగా మార్చుకోవచ్చు. ఇందుకోసం KD 150 మార్పిడి రుసుము, ఆరోగ్య బీమా, రెసిడెన్సీ స్టాంపు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే వేతన అర్హత లేని వారి దరఖాస్తులను మానవతా, ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా పరిశీలిస్తారు. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల తల్లికి కువైట్‌లో చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ ఉంటే, ఆ చిన్నారి విజిట్ వీసాను రెసిడెన్సీగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే, భార్య గత రెసిడెన్సీ గడువు ముగిసి ఏడాది లోపు మాత్రమే అయి ఉంటే, భర్త ఆమె కోసం రెసిడెన్సీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే ఇలాంటి కేసుల్లో రెసిడెన్సీ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ ఆమోదం తప్పనిసరి. అధికారులు మరో ముఖ్య విషయం కూడా స్పష్టం చేశారు. భార్య, పిల్లలకు జారీ చేసిన విజిట్ వీసాలను ఆర్టికల్-18 వర్క్ పర్మిట్‌గా మార్చుకునే అవకాశం లేదు. అర్హత ఉన్న సందర్భాల్లో వాటిని ఆర్టికల్-22 ఫ్యామిలీ/డిపెండెంట్ రెసిడెన్సీ గానే మార్చుకోవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన లులు చైర్మన్ యూసఫ్ అలీ
- కువైట్‌లో ఫ్యామిలీ విజిట్ వీసా నిబంధనల్లో మార్పులు..!!
- అల్ హల్లానియత్ దీవుల వద్ద నౌక ప్రమాదం..!!
- ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో మసీదుల నిర్మాణం.. నిరాశలో స్థానికులు..!!
- ఎలక్ట్రానిక్ ఆర్ట్స్‌ను కొనుగోలు చేసిన సౌదీ నేతృత్వంలోని కన్సార్టియం..!!
- GCC పర్యాటకుల రాకతో ఖతార్ హాస్పిటాలిటీ రంగం వృద్ధి..!!
- అమెరికాలో లెట్యూస్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ .. యూఏఈలో ప్రభావంపై క్లారిటీ..!!
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్‌వో భాగస్వామ్యం..
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!







