ఇరాన్–అమెరికా మధ్య చర్చలు లేవు: విదేశాంగ మంత్రి అరాఘ్చీ
- August 09, 2026
టెహ్రాన్: ఇరాన్, అమెరికా మధ్య ప్రస్తుతం ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. అయితే ఇరు దేశాల మధ్య సందేశాల మార్పిడి మాత్రం మధ్యవర్తుల ద్వారా కొనసాగుతోందని ఆయన తెలిపారు.
అమెరికాతో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలపై స్పందించిన అరాఘ్చీ..మధ్యవర్తుల ద్వారా సందేశాలను పంపుకోవడం, వాటికి సమాధానాలు ఇవ్వడం చర్చలు లేదా చర్చల ప్రక్రియగా పరిగణించలేమని పేర్కొన్నారు.
ఇరాన్ నాయకత్వం ప్రస్తుతం అమెరికాతో చర్చలు జరపాలనే ఉద్దేశంతో లేదని కూడా ఆయన వెల్లడించినట్లు రాయిటర్స్ తెలిపింది.
అయితే, ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్య మార్గాల ద్వారా సందేశాల మార్పిడి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్–అమెరికా మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో అరాఘ్చీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్







