దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- September 27, 2026
దుబాయ్: సేవా పఖ్వాడా స్ఫూర్తికి అనుగుణంగా దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో భారతీయ కార్మికుల కోసం ప్రత్యేక లేబర్ క్యాంప్ నిర్వహించారు. TAK గ్రూప్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ ఈ.వి. విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భారతీయ కార్మికులకు ఆర్థిక, వైద్య అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం, అందుబాటులో ఉన్న ఆరోగ్య సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడం వంటి అంశాలపై వారికి అవసరమైన సమాచారాన్ని అందించారు.
అలాగే భారత కాన్సులేట్ అందిస్తున్న వివిధ సేవలు, అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లపై కార్మికులకు వివరించారు. అవసరమైన సమయంలో సంబంధిత సేవలను ఎలా పొందాలి, సహాయం కోసం ఎవరిని సంప్రదించాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు.
యూఏఈలోని భారతీయ సమాజ సంక్షేమం, శ్రేయస్సు కోసం భారత కాన్సులేట్ చేస్తున్న నిరంతర కృషిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా కార్మికులకు అవసరమైన ఆర్థిక, వైద్య సమాచారం, కాన్సులర్ సేవలకు సంబంధించిన వివరాలను అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు..13 నెలల కనిష్ఠానికి ధర..!!
- KAFD పై దాడులను తీవ్రంగా ఖండించిన GCC..!!
- UNO సూచీలో ఒమన్‌కు మెరుగైన ర్యాంకు..!!
- కువైట్‌లో 494 భవనాలు కూల్చివేత.. ఆదేశాలు జారీ..!!
- బహ్రెయిన్‌లో ‘సెలబ్రేట్ బహ్రెయిన్ 2026’..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026 ఘనంగా ప్రారంభం..!!
- అబుదాబీ ఇంటర్నేషనల్ బోట్ షో 2026కు భారీ స్పందన..
- విశాఖకు మరో ఐటీ కిరీటం..‘బే-టెక్ సిటీ’ నిర్మాణానికి సీఎం ఆదేశం
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!!
- మస్కట్‌లో అల్ ఖువైర్ స్ట్రీట్ ఎగ్జిట్ రాత్రివేళ మూసివేత..!!







