ఎంపీ బాలశౌరి ప్రశ్నకు కేంద్రం సమాధానం
- August 10, 2026
న్యూఢిల్లీ: దేశంలో పాఠశాల విద్యను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి లోక్‌సభలో అడిగిన అన్స్టార్డ్ ప్రశ్న నంబర్ 3565కు కేంద్ర విద్యాశాఖ సమగ్ర సమాధానం ఇచ్చింది.
జాతీయ విద్యా విధానం (NEP)–2020 ద్వారా ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం, అనుభవాధారిత బోధన, సామర్థ్యాధారిత విద్య, బహుళశాఖల విద్యతో పాటు నైపుణ్య విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. విద్యార్థుల్లో ఉన్నత విద్య, ఉపాధి, జీవితాంతం నేర్చుకునే సామర్థ్యాలను పెంపొందించడమే NEP–2020 ప్రధాన లక్ష్యమని పేర్కొంది.
9 నుంచి 12వ తరగతి వరకు నైపుణ్య కోర్సులు
సమగ్ర శిక్ష పథకం కింద 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు NSQF ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్య కోర్సులను అందిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. కమ్యూనికేషన్ స్కిల్స్, స్వీయ నిర్వహణ, ఐసీటీ, వ్యవస్థాపకత, గ్రీన్ స్కిల్స్ వంటి అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపింది.
అలాగే 6వ నుంచి 8వ తరగతి విద్యార్థులకు బ్యాగ్‌లెస్ డేస్, స్థానిక నిపుణులతో ఇంటర్న్‌షిప్‌లు, అనుభవాధారిత అభ్యాసాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొంది.
డిజిటల్ విద్యకు ప్రాధాన్యం
విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు DIKSHA, SWAYAM, SWAYAM PRABHA, వర్చువల్ స్కిల్ ల్యాబ్స్, PM SHRI పాఠశాలలు వంటి వేదికల ద్వారా డిజిటల్ విద్యను విస్తరిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది.
పాఠశాల మానివేతలను తగ్గించేందుకు చర్యలు
విద్యార్థుల పాఠశాల మానివేతలను తగ్గించడం, పాఠశాలల్లో నమోదు శాతాన్ని పెంచడం కోసం సమగ్ర శిక్ష, పీఎం పోషణ పథకాల ద్వారా వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.
కొత్త పాఠశాలల ఏర్పాటు, మౌలిక వసతుల అభివృద్ధి, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల విస్తరణ, వసతి గృహాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, రవాణా సౌకర్యం, వృత్తి విద్య, ఐసీటీ సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించింది.
విద్యాశాఖ బడ్జెట్ పెంపు
కేంద్ర విద్యాశాఖ బడ్జెట్‌ను కూడా ప్రతి సంవత్సరం పెంచుతున్నట్లు కేంద్రం తెలిపింది. 2022–23లో రూ.1,04,278 కోట్లుగా ఉన్న విద్యాశాఖ బడ్జెట్ 2026–27 నాటికి రూ.1,39,289 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది.
ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ, దేశంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను విస్తరించడం ద్వారా యువత ఉపాధి సామర్థ్యం మరింత పెరుగుతుందని అన్నారు. నైపుణ్యవంతమైన యువత దేశ ఆర్థికాభివృద్ధికి మరింతగా దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో వేగం కోసం అన్ని విభాగాల సమన్వయం అవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..!
- దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ‘ట్రంప్ టవర్స్’
- ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోకుండా సులభ చెల్లింపు మార్గాలు..దుబాయ్ పోలీసుల అవగాహన
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోసం గూఢచర్యం.. బహ్రెయిన్‌లో ఇద్దరికి జీవిత ఖైదు
- నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లతో లైసెన్స్‌కు దరఖాస్తు..27 మంది పై ఖతార్ నిషేధం
- తెలంగాణలో ముగిసిన SIR ప్రక్రియ!
- ప్రయాణికులకు మరింత భరోసా..5 కీలక సౌకర్యాలను ప్రకటించిన ఎమిరేట్స్
- కువైట్ లో శస్త్రచికిత్సలపై కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో 2,944 మంది కార్మికులు డిపోర్ట్..!!







