విదేశీ నగరంలో షేక్ మహ్మద్‌ను కలిసిన అనుభవం..కొడుకు వేసవి జ్ఞాపకాన్ని పంచుకున్న UAE అధికారి
- August 10, 2026
దుబాయ్: సెలవుల కోసం విదేశాలకు వెళ్లిన సమయంలో అనుకోకుండా UAEలోని ప్రముఖ నాయకుడిని కలవడం తన కుమారుడికి ఈ వేసవిలో మరపురాని అనుభవంగా మిగిలిపోయిందని UAE విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి అఫ్రా అల్ హమెలి తెలిపారు.
UAE విదేశాంగ మంత్రిత్వ శాఖలో వ్యూహాత్మక కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అఫ్రా అల్ హమెలి సోషల్ మీడియా వేదిక Xలో ఈ విషయాన్ని పంచుకున్నారు.
తన కుమారుడు మజీద్‌ను ఈ వేసవిలో అత్యంత ఇష్టమైన జ్ఞాపకం ఏమిటని అడిగినప్పుడు, విదేశీ నగరంలో దుబాయ్ రూలర్, UAE ఉపాధ్యక్షుడు మరియు ప్రధాన మంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ను అనుకోకుండా కలుసుకోవడమే తనకు అత్యంత గుర్తుండిపోయే అనుభవమని చెప్పినట్లు ఆమె వెల్లడించారు.
షేక్ మహ్మద్ నగరంలో సాధారణంగా తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కనిపించడం తన కుమారుడిపై ప్రత్యేకమైన ముద్ర వేసిందని అఫ్రా అల్ హమెలి తెలిపారు.
“ఇదే UAE నాయకత్వం. ఎల్లప్పుడూ ప్రజలకు దగ్గరగా ఉంటుంది..తరతరాలకు స్ఫూర్తినిస్తుంది” అని ఆమె పేర్కొన్నారు.
ప్రజలతో నాయకత్వానికి ఉన్న సాన్నిహిత్యాన్ని చాటిచెప్పే ఈ అనుభవం తన కుమారుడికి వేసవి సెలవుల్లో ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలిచిపోయిందని అఫ్రా అల్ హమెలి వెల్లడించారు.
When I asked my son Majid about the highlight of his summer, his answer was: running into @HHShkMohd. Seeing His Highness walking around town, taking the time to greet everyone with such genuine warmth and humility, left a lasting impression on him.
— Afra Al Hameli (@AfraMalHameli) August 10, 2026
This is the UAE’s… https://t.co/Y5Qo5F3uMC
తాజా వార్తలు
- దశాబ్దాల సమస్యకు పరిష్కారం..830 కుటుంబాలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
- పెద్ది కుటుంబానికి కేసీఆర్ భరోసా!
- గ్లోబల్ విలేజ్ సీజన్–31.. F&B వ్యాపారాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- ఇక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. డిజిటల్‌గా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్
- విదేశీ నగరంలో షేక్ మహ్మద్‌ను కలిసిన అనుభవం..కొడుకు వేసవి జ్ఞాపకాన్ని పంచుకున్న UAE అధికారి
- ఎంపీ బాలశౌరి ప్రశ్నకు కేంద్రం సమాధానం
- మలేషియాలో ఘనంగా MYTA బోనాలు 2026 వేడుకలు
- ఒమన్‌లో మృతి చెందిన తెలంగాణ గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి తరలింపు
- లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటాం: డీజీపీ సీవీ ఆనంద్
- ఒమన్‌లో 12 కిలోల ఉల్కాశకలం గుర్తింపు..!!







