తెలంగాణలో ముగిసిన SIR ప్రక్రియ!
- August 11, 2026
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగమైన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ పేర్లు జాబితాలో సరిగ్గా నమోదు అయ్యాయో లేదో సులభంగా తెలుసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ప్రజలు తమ మొబైల్ ఫోన్ నుండి ECI <స్పేస్> ఓటరు ఐడీ సంఖ్య (EPIC Number) అని టైప్ చేసి 1950 నంబర్‌కు SMS పంపడం ద్వారా తమ వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవచ్చు. తిరిగి మీ వివరాలతో ఎస్ఎమ్ఎస్ వస్తే SIR ప్రక్రియ పూర్తయినట్లు ధ్రువీకరించుకోవచ్చు. ఒకవేళ ఎలాంటి సమాచారం రాకపోతే వెంటనే సంబంధిత బూత్ స్థాయి అధికారిని (BLO) సంప్రదించి వివరాలు సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ నెల 17న డ్రాఫ్ట్ లిస్ట్ విడుదల: కొత్త ఓటర్లకు ‘ఫాం-6’ అవకాశం
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ తదుపరి ఘట్టంలో భాగంగా ఈ నెల 17వ తేదీన అధికారులు ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ జాబితాలో తమ పేర్లు లేని వారు లేదా కొత్తగా ఓటు హక్కు పొందాలనుకునే 18 ఏళ్లు నిండిన పౌరులు ‘ఫాం-6’ (Form-6) నింపి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత అభ్యంతరాలు, సవరణలకు తగిన సమయం ఇస్తారు కాబట్టి, పౌరులందరూ తమ ఓటు హక్కు భద్రంగా ఉందో లేదో ముందే సరిచూసుకోవాలని ఎన్నికల యంత్రాంగం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్‌లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







