రాజు బొనగాని దర్శకత్వంలో ఆఫ్టర్ ఇంజనీరింగ్ నూతన చిత్రం
- August 11, 2026
రాస్రా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై రాజు బొనగాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆఫ్టర్ ఇంజనీరింగ్. ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించిన రాస్రా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నూతన నటీనటులను పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న రాజు బొనగాని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఆఫ్టర్ ఇంజనీరింగ్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కథాంశంతో తెలుగు చిత్ర పరిశ్రమలో రాజు బొనగాని తనదైన ముద్ర వేయనున్నారు. వినూత్న కథలను, ఎమోషనల్ లవ్ స్టోరీ లను ఎప్పుడు ఆదరించే తెలుగు ప్రేక్షకులకు ఆఫ్టర్ ఇంజనీరింగ్ చాలా కాలం పాటు గుర్తుండిపోయే సినిమా అవుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రస్తుతం సినిమా పాటలు రికార్డింగ్ జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన పూర్తి అప్డేట్ వెల్లడిస్తామని తెలిపారు.
ఆఫ్టర్ ఇంజనీరింగ్( థిస్ ఈజింట్ జస్ట్ మై స్టోరీ, ఇట్స్ అవర్ స్టోరీ ) ఇది నా స్టోరీ మాత్రమే కాదు మన అందరి స్టోరీ అనే శీర్షికతో వస్తున్న ఈ చిత్రం యూత్ ని ఆకట్టుకుంటుందని డైరెక్టర్ రాజు బొనగాని తెలిపారు. రాస్రా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను త్వరలోనే ఒక ప్రత్యేక ఈవెంట్ ను ఏర్పాటు చేసి తెలియజేస్తామని డైరెక్టర్ రాజు బోనగాని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో వేగం కోసం అన్ని విభాగాల సమన్వయం అవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..!
- దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ‘ట్రంప్ టవర్స్’
- ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోకుండా సులభ చెల్లింపు మార్గాలు..దుబాయ్ పోలీసుల అవగాహన
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోసం గూఢచర్యం.. బహ్రెయిన్‌లో ఇద్దరికి జీవిత ఖైదు
- నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లతో లైసెన్స్‌కు దరఖాస్తు..27 మంది పై ఖతార్ నిషేధం
- తెలంగాణలో ముగిసిన SIR ప్రక్రియ!
- ప్రయాణికులకు మరింత భరోసా..5 కీలక సౌకర్యాలను ప్రకటించిన ఎమిరేట్స్
- కువైట్ లో శస్త్రచికిత్సలపై కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో 2,944 మంది కార్మికులు డిపోర్ట్..!!







