రెస్టారెంట్లలో ఉల్లంఘనలపై కెమెరాలతో నిఘా..!!
- August 12, 2026
రియాద్: సౌదీ అరేబియాలో రెస్టారెంట్లు, ఆహార విక్రయ కేంద్రాల్లో ఆహార భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ మేరకు మున్సిపాలిటీలు, హౌసింగ్ మంత్రిత్వ శాఖ ఆరోగ్య నిబంధనలను నవీకరించడంతో పాటు క్షేత్రస్థాయి తనిఖీలను ముమ్మరం చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆహార సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ వినియోగదారుల ఆరోగ్యం, ఆహార భద్రతకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ చర్యల్లో భాగంగా రెస్టారెంట్లలో నిబంధనల ఉల్లంఘనలు, ఆహార భద్రతా లోపాలను గుర్తించి రికార్డు చేసేందుకు పోర్టబుల్ కెమెరాలను వినియోగిస్తున్నారు.
సౌదీ ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ మానిటరింగ్ వ్యవస్థలో మొబైల్ కెమెరాలను కీలక భాగంగా ఉపయోగిస్తోంది. తనిఖీల సమయంలో చేపట్టే కార్యకలాపాలను ఈ కెమెరాలతో రికార్డు చేసి, వాటిని నేరుగా ‘ముమ్తతిల్’ (Mumtathil) అప్లికేషన్‌తో అనుసంధానిస్తున్నారు. దీంతో తనిఖీల ప్రక్రియలో పారదర్శకత పెరగడంతో పాటు అధికారులు, సంస్థల యజమానుల హక్కులను కూడా పరిరక్షించవచ్చని అధికారులు తెలిపారు. ఆహార రంగంలో పనిచేసే సిబ్బందికి ఆరోగ్య ధ్రువపత్రాల జారీని మరింత సులభతరం చేయడంతో పాటు వాటిని ఎలక్ట్రానిక్ విధానంలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇదిలా ఉండగా.. మున్సిపాలిటీలు, స్థానిక అధికారులు రెస్టారెంట్లు, వంటశాలలు, ఆహార విక్రయ కేంద్రాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య నిబంధనల అమలు, ఆహారం తయారీ, నిల్వ, నిర్వహణ విధానాలను పరిశీలిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలను గుర్తించి, అవసరమైన చోట చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆహార విక్రయ కేంద్రాల్లో ఏవైనా ఉల్లంఘనలు లేదా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే అధికారులకు తెలియజేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







