డీప్‌ఫేక్‌లపై ఖతార్ హోంశాఖ హెచ్చరిక..!!
- August 12, 2026
దోహా: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో వ్యక్తులను అనుకరిస్తూ రూపొందిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు, ఆడియోలు, ఇతర కృత్రిమ కంటెంట్‌పై ఖతర్ హోంశాఖ (MoI) ప్రజలను అప్రమత్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన హెచ్చరికలో డిజిటల్ భద్రతకు సంబంధించిన పలు సూచనలు చేసింది. AI ఆధారిత మోసాలకు ప్రజలు బలికాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ.. “మీరు చూసినదంతా, విన్నదంతా నిజం కాదు” అని హోంశాఖ పేర్కొంది.
డీప్‌ఫేక్‌ల బారిన పడకుండా ప్రజలు ఆన్లైన్లో కనిపించే కంటెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ సూచించింది. ఏదైనా వీడియో, ఆడియో లేదా సమాచారాన్ని ఇతరులకు పంపే ముందు దాని మూలం, విశ్వసనీయతను తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని తెలిపింది. సమాచారం నిజమని నిర్ధారణ కానంత వరకు దాన్ని నమ్మడం లేదా షేర్ చేయడం చేయొద్దని హెచ్చరించింది. AI వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ కంటెంట్‌ను పరిశీలించి, దాని నిజానిజాలను నిర్ధారించుకున్న తర్వాతే స్పందించడం ద్వారా ప్రజలు మోసాల నుంచి రక్షించుకోవచ్చని హోంశాఖ పేర్కొంది.
మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలను ఉపయోగించి ఒక వ్యక్తి నిజంగా చెప్పని మాటలను చెప్పినట్లు, చేయని పనులను చేసినట్లు కనిపించేలా రూపొందించే కృత్రిమ వీడియోలు, ఆడియోలు, చిత్రాలు, ఇతర డిజిటల్ కంటెంట్‌ను డీప్‌ఫేక్‌లుగా పిలుస్తారు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన AI సాంకేతికతతో వాయిస్ క్లోనింగ్, కృత్రిమ వీడియో కాల్స్, AI రూపొందించిన కంటెంట్ ద్వారా వ్యక్తుల గొంతు, మాట్లాడే విధానం, రూపాన్ని కూడా నమ్మశక్యం కాని రీతిలో అనుకరించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







