183కి పైగా దేశాల్లో యూఏఈ ‘జైవాన్’ కార్డుల వినియోగం..!!
- August 12, 2026
దుబాయ్: యూఏఈకి చెందిన ‘జైవాన్’ (Jaywan) చెల్లింపు కార్డుల వినియోగం ఇకపై అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించనుంది. ఈ మేరకు ఎతిహాద్ పేమెంట్స్, యూనియన్‌పే ఇంటర్నేషనల్‌తో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఆగస్టు 11న చైనాలోని షాంఘైలో యూనియన్‌పే ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఎతిహాద్ పేమెంట్స్ బోర్డు చైర్మన్ సైఫ్ హుమైద్ అల్ ధహేరీ, యూనియన్‌పే చైనా, యూనియన్‌పే ఇంటర్నేషనల్ బోర్డు చైర్మన్ డాంగ్ జున్‌ఫెంగ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా జైవాన్ కార్డులను 183కి పైగా దేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా పాయింట్ ఆఫ్ సేల్ (POS) కేంద్రాల్లో, అలాగే 18 లక్షలకు పైగా ఏటీఎంలలో వినియోగించుకునే అవకాశం కలగనుంది.
యూఏఈ వెలుపల జైవాన్ కార్డులతో జరిగే లావాదేవీలను యూనియన్‌పే ఇంటర్నేషనల్.. ఎతిహాద్ పేమెంట్స్ నిర్వహించే ఎమిరేట్స్ ఎలక్ట్రానిక్ స్విచ్ వ్యవస్థకు బదిలీ చేయనుంది. కార్డుల అంతర్జాతీయ విస్తరణకు అవసరమైన సెటిల్మెంట్, లిక్విడిటీ, విదేశీ మారక సేవలకు సంబంధించి ప్రత్యేక అవగాహన ఒప్పందం కూడా అమలు చేయనున్నారు.ఈ భాగస్వామ్యం ద్వారా యూఏఈకి చెందిన స్థానిక చెల్లింపు కార్డు వ్యవస్థ అంతర్జాతీయ పోటీతత్వం పెరగడంతో పాటు, చెల్లింపుల సెటిల్మెంట్లో స్థానిక కరెన్సీల వినియోగం మరింత సమర్థవంతం అవుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఎతిహాద్ పేమెంట్స్, యూనియన్పేతో కలిసి యూఏఈలోని ఆర్థిక సంస్థల ద్వారా ‘జైవాన్–యూనియన్‌పే’ మల్టీ-సిస్టమ్ కార్డులను జారీ చేస్తోంది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







