తెలంగాణాలో పెరగనున్న మెడికల్ సీట్లు

- August 16, 2016 , by Maagulf
తెలంగాణాలో పెరగనున్న మెడికల్ సీట్లు

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త... మెడికల్‌ సీట్లు పెరగనున్నాయి. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణలో మరో మూడు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. పెరిగిన సీట్లు ఈ ఏడాది నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఎంసెట్‌-2 లీకేజీతో ఇబ్బందిపడుతున్న విద్యార్థులకు తీపికబురందింది. అదనంగా మెడికల్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దేశ వ్యాప్తంగా 26 మెడికల్‌ కాలేజీలకు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చింది. వాటిలో మూడు తెలంగాణ విద్యా సంస్థలకు అనుమతి ఇచ్చింది. మెదక్‌ జిల్లా ములుగూరు మండలంలోని ఆర్‌వీఎం మెడికల్‌ కాలేజీ, రంగారెడ్డి జిల్లాలోని మహావీర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, పటాన్‌చెరులోని మహేశ్వరా మెడికల్‌ సైన్సెస్‌కు కొత్తగా అనుమతులు రాబోతున్నాయి. వీటిలో ఒక్కొక్కదానికి 150 సీట్లు చొప్పున 450 సీట్లు భర్తీ చేసుకోవచ్చు. ఇందులో 50 శాతం కన్వీనర్‌ కోటాకిందకు వస్తాయి. ఈ కళాశాలలకు సంబంధించిన తనికీ సెప్టెంబర్‌లో జరగనుంది. కొత్త సీట్ల రాకతో తెలంగాణలోని సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలో వెయ్యి, ఈఎస్‌ఐ 60, ప్రైవేట్‌ రంగలో 2,350 సీట్లకు కౌన్సెలింగ్‌ జరగనుంది. వీటి కౌన్సెలింగ్‌ ఎంసెట్‌-3, నీట్‌-2 ఆధారంగా చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com