తెలంగాణాలో పెరగనున్న మెడికల్ సీట్లు
- August 16, 2016
తెలంగాణ విద్యార్థులకు శుభవార్త... మెడికల్ సీట్లు పెరగనున్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణలో మరో మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. పెరిగిన సీట్లు ఈ ఏడాది నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఎంసెట్-2 లీకేజీతో ఇబ్బందిపడుతున్న విద్యార్థులకు తీపికబురందింది. అదనంగా మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దేశ వ్యాప్తంగా 26 మెడికల్ కాలేజీలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. వాటిలో మూడు తెలంగాణ విద్యా సంస్థలకు అనుమతి ఇచ్చింది. మెదక్ జిల్లా ములుగూరు మండలంలోని ఆర్వీఎం మెడికల్ కాలేజీ, రంగారెడ్డి జిల్లాలోని మహావీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పటాన్‌చెరులోని మహేశ్వరా మెడికల్ సైన్సెస్‌కు కొత్తగా అనుమతులు రాబోతున్నాయి. వీటిలో ఒక్కొక్కదానికి 150 సీట్లు చొప్పున 450 సీట్లు భర్తీ చేసుకోవచ్చు. ఇందులో 50 శాతం కన్వీనర్ కోటాకిందకు వస్తాయి. ఈ కళాశాలలకు సంబంధించిన తనికీ సెప్టెంబర్‌లో జరగనుంది. కొత్త సీట్ల రాకతో తెలంగాణలోని సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలో వెయ్యి, ఈఎస్ఐ 60, ప్రైవేట్ రంగలో 2,350 సీట్లకు కౌన్సెలింగ్ జరగనుంది. వీటి కౌన్సెలింగ్ ఎంసెట్-3, నీట్-2 ఆధారంగా చేస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







