ఆరోగ్యానికి మేలు చేసే పెసలు
- August 16, 2016
పెసలతో చేసే వంటల రుచి గురించి చెప్పనక్కరలేదు. ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. చిన్నారులు, పెద్దలు అందరూ తరచుగా వీటిని తీసుకోవటం వలన ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. పెసల్లో కొలస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. దీనిలో ఇనుము సమృద్దిగా ఉండుట వలన రక్తహినత ఉన్నవారు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. అలాగే ఎదిగే చిన్నారులకు, బాగా ఆటలు ఆడేవారికి ఇవి చాలా మేలు చేస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవటం వలన శరీరంలోని వ్యర్ధాలు బయటకు వస్తాయి. వీటిల్లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలతో పోరాటం చేస్తాయి. పెసల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. వీరిలో క్యాల్షియం, బి విటమిన్స్ సమృద్దిగా ఉండుట వలన ఎదిగే పిల్లలకు వీటిని తినిపించటం వలన ఎముకలు గట్టిపడతాయి. ఇది తేలికపాటి ఆహారం కావటం వలన తేలికగా జీర్ణం అవుతుంది. అంతేకాక మధుమేహం ఉన్నవారికి పెసలు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే పోషకాలు రక్తంలోని చక్కర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. పెసలను వంటకాల రూపంలో తీసుకోకపోయినా, నానబెట్టి మొలకల రూపంలో కూడా తీసుకోవచ్చు. కందిపప్పుకు బదులుగా పెసరపప్పును వంటల్లో ఉపయోగించవచ్చు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







