ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- August 13, 2026
విజయవాడ: విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల సౌకర్యార్థం మరియు భద్రతా దృష్ట్యా నూతన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆలయ పవిత్రతను, భద్రతను దృష్టిలో ఉంచుకుని అమ్మవారి సన్నిధిలోకి మొబైల్ ఫోన్లను తీసుకువెళ్లడాన్ని అధికారులు పూర్తిగా నిషేధించారు. ఇకపై భక్తులు ఎవరూ కూడా తమ ఫోన్లను ఆలయ ప్రాంగణంలోకి తీసుకెళ్లడానికి అనుమతి లేదు.
ప్రత్యేక స్కానింగ్ పాయింట్లు, డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు
ఈ నిబంధనను కఠినంగా అమలు చేసేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రవేశ మార్గాల వద్ద ప్రత్యేక భద్రతా గేట్లతో పాటు స్కానింగ్ పాయింట్లను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. క్యూ లైన్లలోకి ప్రవేశించే ముందే భక్తులు తమ మొబైల్ ఫోన్లను భద్రపరచుకునేందుకు ఆలయ సిబ్బంది ప్రత్యేకంగా డిపాజిట్ కౌంటర్లను అందుబాటులోకి తెచ్చారు.
ఈవో శీనా నాయక్ కఠిన ఆదేశాలు
ఆలయంలో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేయాలని ఆలయ ఈవో శీనా నాయక్ అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని, తనిఖీలను కట్టుదిట్టం చేయాలని సిబ్బందికి స్పష్టమైన సూచనలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్







