‘ఇరుముడి’ నుంచి.. అయ్యప్ప స్వామి మల్లెపూల పల్లకి సాంగ్ వచ్చేసింది..

- August 16, 2026 , by Maagulf
‘ఇరుముడి’ నుంచి.. అయ్యప్ప స్వామి మల్లెపూల పల్లకి సాంగ్ వచ్చేసింది..

రవితేజ, ప్రియా భవాని శంకర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ఇరుముడి’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 21న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్, ట్రైలర్, సాంగ్స్ తో అంచనాలు పెంచేశారు. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపిస్తూనే యాక్షన్ కథ ఉండటం, సినిమాలో సాంగ్స్ బాగుండటం, అయ్యప్ప స్వామి ప్రైవేట్ ఆల్బమ్ మల్లెపూల పల్లకి సాంగ్ ఈ సినిమాలో ఉంటుంది అని ప్రకటించడంతో భారీ హైప్ నెలకొంది.

నేడు ఇరుముడి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇరుముడి సినిమా నుంచి ప్రేక్షకులు, అయ్యప్పస్వామి భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న మల్లెపూల పల్లకి సాంగ్ ని తాజాగా విడుదల చేసారు. ఈ పాటకి థియేటర్స్ ఊగిపోవడం ఖాయం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com