యూఏఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల పనితీరుపై వీడియో విడుదల..!!
- August 19, 2026
అబుదాబి: గగనతల ముప్పులను ఎదుర్కొంటూ దేశాన్ని ఎలా రక్షిస్తుందో చూపించేలా యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల పనితీరుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఆగస్టు 18న విడుదల చేసిన ఈ వీడియోలో యూఏఈ ఎయిర్‌ఫోర్స్, వివిధ రక్షణ వ్యవస్థలు చర్యల్లో ఉన్న దృశ్యాలను చూపించారు. దేశ భద్రత, సుస్థిరతను కాపాడేందుకు తమ రక్షణ వ్యవస్థలు అత్యంత దృఢ సంకల్పంతో స్పందించగలవని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇరాన్ నుంచి రెండు బాలిస్టిక్ క్షిపణులు
యూఏఈ అధికారులు మంగళవారం ఇరాన్ నుంచి దేశం వైపు రెండు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు గుర్తించారు. యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. మొదటి క్షిపణి యూఏఈ ప్రాదేశిక జలాల వెలుపల పడగా, రెండో క్షిపణి ప్రాదేశిక జలాల్లో పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో యూఏఈ అధికారులు ప్రజలకు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. సమీపంలోని సురక్షిత భవనంలోకి వెంటనే వెళ్లి ఆశ్రయం పొందాలని సూచించారు. సాయంత్రం 6.52 గంటలకు వచ్చిన ఈ హెచ్చరికతో పలువురు యూఏఈ నివాసితులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. జూలై 12 తర్వాత ఇలాంటి హెచ్చరిక రావడం ఇదే తొలిసారి.
గతంలోనూ అత్యవసర హెచ్చరికలు
జూలై 12న కూడా దేశవ్యాప్తంగా వినిపించిన శబ్దాలు కొనసాగుతున్న క్షిపణి అడ్డుకునే చర్యలకు సంబంధించినవేనని యూఏఈ అధికారులు వెల్లడించారు. ప్రజలు ప్రశాంతంగా ఉండి భద్రతా సూచనలు పాటించాలని అప్పట్లో కోరారు.అంతకుముందు మే 4న కూడా గగనతల ముప్పుల నేపథ్యంలో యూఏఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసింది. ప్రజలకు ఇళ్లలో లేదా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తూ పలు అత్యవసర హెచ్చరికలు పంపారు. అయితే ఇటీవల వచ్చిన ప్రతి అత్యవసర అలర్ట్ భద్రతా ముప్పుతో సంబంధం ఉన్నది కాదని అధికారులు స్పష్టం చేశారు. జూన్ 26న వచ్చిన ఓ అత్యవసర హెచ్చరిక సాంకేతిక లోపం కారణంగా జారీ అయినట్లు తర్వాత అధికారులు వివరణ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







