ఆగస్టు 21న జైలర్ 2 నుంచి పాట విడుదల
- August 19, 2026
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జైలర్ 2’. ఈ సినిమా సంగీతానికి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ నుంచి మొదటి సింగిల్‌ను ఆగస్టు 21న విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
‘హుకుమ్’ రేంజ్లో సరికొత్త సౌండ్‌స్కేప్
గతంలో ‘జైలర్’ చిత్రంలో వచ్చిన ‘హుకుమ్’ పాట దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ పాట ఇచ్చిన ఉత్సాహంతో, ఈసారి ‘జైలర్ 2’ కోసం అనిరుధ్ రవిచందర్ మరింత శక్తివంతమైన మాస్ సౌండ్‌స్కేప్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. డైరెక్టర్ నెల్సన్ విజన్‌కు సరిగ్గా సరిపోయేలా, రజనీకాంత్ మేనరిజమ్‌ను మ్యాచ్ చేసేలా ఈ పాట ఉండబోతోంది.
ఆల్బమ్‌పై భారీ అంచనాలు
ఇటీవల వచ్చిన ‘కూలీ’ ఆల్బమ్‌తో అభిమానుల అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేకపోయిన అనిరుధ్, ఈసారి ‘జైలర్ 2’తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. థియేటర్లలో బాక్సాఫీస్ దద్దరిల్లేలా, అభిమానులకు పూనకాలు తెప్పించే రేంజ్లో అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ఉండబోతున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆగస్టు 21న రాబోతున్న ఈ ఫస్ట్ సింగిల్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రాఫర్‌గా మారిన సీఎం చంద్రబాబు
- మూవీ టికెట్ రేట్ల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
- తమిళనాడు ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ బంపర్ ఆఫర్
- కార్మిక రెసిడెన్సీల రద్దు, ఇరాన్‌కు ఆర్థిక సౌకర్యాలపై UAE స్పష్టత
- ఘోర అగ్నిప్రమాదం: హోటల్లో మంటలు చిక్కుకుని 9 మంది మృతి!
- బంగారు గని కూలి 30 మంది దుర్మరణం!
- భోగాపురం ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఛార్జీల షాక్
- రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ: ముగ్గురు విద్యార్థుల హస్తం?
- కువైట్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు..!!
- హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీ.. ప్రయాణికులకు కీలక సూచనలు..!!







