ఘోర అగ్నిప్రమాదం: హోటల్‌లో మంటలు చిక్కుకుని 9 మంది మృతి!
- August 19, 2026
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని న్యూమార్కెట్ సమీపంలో ఉన్న మిర్జా గాలిబ్ వీధిలోని ఓ హోటల్‌లో (షిఖా ఇన్) బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషాద ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన వివరాలు & రెస్క్యూ ఆపరేషన్
బుధవారం తెల్లవారుజామున సుమారు 2:00 గంటల సమయంలో హోటల్‌లోని ఒక గదిలో మంటలు చెలరేగి వేగంగా ఇతర గదులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే 5 అగ్నిమాపక యంత్రాలు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. హోటల్ నుంచి దాదాపు 60 మందిని సురక్షితంగా బయటకు తరలించారు. మరణించిన తొమ్మిది మందిలో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక చిన్నారు ఉన్నారు. వీరంతా వైద్య చికిత్స నిమిత్తం బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా వచ్చి ఈ హోటల్‌లో బస చేసినట్లు అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు. దట్టమైన పొగ కారణంగా అస్వస్థతకు గురైన మరో ఆరుగురిని చికిత్స కోసం కోల్‌కతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (SSKM) కు తరలించారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ఘట్టంలో దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరాడక చాలా మంది స్పృహ తప్పిపడిపోయినట్లు పోలీసులు తెలిపారు. షాట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా? లేక భద్రతా నిబంధనల ఉల్లంఘన ఉందా? అనే కోణంలో న్యూమార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







