ఇద్దరు పౌరులను ఆస్పత్రికి తరలించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!

- August 20, 2026 , by Maagulf
ఇద్దరు పౌరులను ఆస్పత్రికి తరలించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!

మస్కట్: ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన విమానం అత్యవసర వైద్య సేవల్లో భాగంగా ఇద్దరు పౌరులను ఆస్పత్రికి తరలించింది. నార్త్ అల్ బతీనా గవర్నరేట్‌లోని అల్-మలాహా పోలీస్ స్టేషన్ నుంచి ముసందమ్ గవర్నరేట్‌లోని ఖసబ్ ఆస్పత్రికి వారిని విమానంలో తరలించినట్లు అధికారులు తెలిపారు.

అవసరమైన సమయంలో వేగంగా వైద్య రవాణా సేవలు అందించడంలో భాగంగా ఈ ఎయిర్ ఎవాక్యుయేషన్ ఆపరేషన్ నిర్వహించినట్లు రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు త్వరితగతిన వైద్య సహాయం అందించేందుకు రాయల్ ఎయిర్ ఫోర్స్ ఇటువంటి వైమానిక తరలింపు సేవలను అందిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com