కువైట్‌లో కల్తీ ఆహారంపై అధికారుల కొరడా..!!

- August 20, 2026 , by Maagulf
కువైట్‌లో కల్తీ ఆహారంపై అధికారుల కొరడా..!!

కువైట్: కువైట్‌లో కల్తీ ఆహార పదార్థాలపై అధికారులు కొరడా ఝళిపించారు. షుబ్రా అల్-జలీబ్ మార్కెట్‌లో నిర్వహించిన తనిఖీల్లో 100 కిలోల గుర్తుతెలియని మీట్ ను అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై 8 కేసులు నమోదు చేసినట్టు పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అధికారులు తెలిపారు.

అథారిటీకి చెందిన ఇన్‌స్పెక్షన్ విభాగం అధికారులు షుబ్రా అల్-జలీబ్ ప్రాంతంలోని ఆహార సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో కల్తీ ఆహార పదార్థాలను విక్రయించినందుకు 4 కేసులు, అలాగే మూలం, వివరాలు తెలియని సుమారు 100 కిలోల మాంసాన్ని ధ్వంసం చేసినందుకు మరో 4 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

కువైట్‌లోని వివిధ గవర్నరేట్లలో ఆహార సంస్థలు, ఆహార కార్యకలాపాలపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ స్పష్టం చేసింది. వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడటం, మార్కెట్లలో విక్రయించే ఆహార పదార్థాల భద్రత, నాణ్యతను నిర్ధారించడమే ఈ తనిఖీల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com