రియాద్ విమానాశ్రయంలో ‘సైలెంట్ ఎయిర్‌పోర్ట్’ ప్రాజెక్ట్ ప్రారంభం..!!

- August 20, 2026 , by Maagulf
రియాద్ విమానాశ్రయంలో ‘సైలెంట్ ఎయిర్‌పోర్ట్’ ప్రాజెక్ట్ ప్రారంభం..!!

రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం ‘సైలెంట్ ఎయిర్‌పోర్ట్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా టెర్మినల్ 5లో తొలి దశను అమలు ప్రారంభించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.

ప్రయాణికులకు మరింత ప్రశాంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా విమానాశ్రయంలో చేసే సాధారణ పబ్లిక్ అనౌన్స్‌మెంట్లను తగ్గించి, వాటిని ప్రధానంగా డిపార్చర్ గేట్లకు పరిమితం చేయనున్నారు. అదే సమయంలో విమానాల సమాచారం అందించేందుకు డిజిటల్ స్క్రీన్లు, ఇతర డిజిటల్ కమ్యూనికేషన్ మార్గాల వినియోగాన్ని పెంచనున్నారు.

వాట్సాప్ ద్వారా ఫ్లైట్ సమాచారం

ప్రయాణికులు తమ విమానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకునేందుకు విమానాశ్రయం వాట్సాప్ నంబర్ 920020090, అధికారిక వెబ్‌సైట్, విమానాశ్రయంలోని సూచిక బోర్డులు, అలాగే ‘Ask Me’ టీమ్ సేవలను వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

‘సైలెంట్ ఎయిర్‌పోర్ట్’ ప్రాజెక్ట్ తదుపరి దశల అమలుపై వివరాలను తగిన సమయంలో ప్రకటిస్తామని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com