‘రంభ ఊర్వశి మేనక’ నుంచి 'బ్యాడ్ టైం బ్యాండ్ బాజా' సాంగ్ రిలీజ్
- August 21, 2026
కామెడీ సినిమాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ మరోసారి తనకు బాగా కలిసొచ్చిన జానర్లో సందడి చేయబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘నా కంటి మీద కనులే’, టీజర్ సినిమా పై అంచనాలు పెంచాయి. తాజాగా బ్యాడ్ టైం బ్యాండ్ బాజా సాంగ్ రిలీజ్ చేశారు.
‘బ్యాడ్ టైం బ్యాండ్ బాజా’ పేరుకు తగ్గట్టుగానే పాట ఆద్యంతం ఫుల్ ఎనర్జీ, ఫన్‌తో సాగుతుంది. హీరో జీవితంలో ఎదురయ్యే బ్యాడ్ టైమ్‌ను కామెడీగా ప్రజెంట్ చేస్తూ, క్యాచీ ట్యూన్‌తో పాటను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.
చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ఎనర్జిటిక్ ట్యూన్‌కు రామ్ మిరియాల తన ప్రత్యేకమైన వాయిస్‌తో మరింత జోష్ తీసుకొచ్చారు.
భాస్కరభట్ల రవికుమార్ అందించిన లిరిక్స్ పాటలోని కామెడీ, ఫన్ ఎలిమెంట్‌ను మరింత ఎలివేట్ చేస్తున్నాయి.
అల్లరి నరేష్ తనదైన టైమింగ్‌తో ఆకట్టుకునేలా కనిపిస్తుండగా, పాట విజువల్స్ కూడా సినిమాకు ఉండబోయే ఫన్-ఫిల్డ్ ట్రీట్‌కు ఒక గ్లింప్స్‌లా నిలుస్తున్నాయి. రంభ ఊర్వశి మేనక గా రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ ప్రజెన్స్ ఆకట్టుకుంది.
చైతన్ భరద్వాజ్ మ్యూజిక్, రామ్ మిరియాల ఎనర్జిటిక్ వోకల్స్, భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
‘రంభ ఊర్వశి మేనక’ సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
నటీనటులు: అల్లరి నరేష్, సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్, వెన్నెల కిషోర్, నరేష్ వి.కె., శ్రీనివాస్ రెడ్డి, రచ్చ రవి, మురళీధర్ గౌడ్
సాంకేతిక బృందం:
దర్శకత్వం: చంద్ర మోహన్ చింతడ
నిర్మాతలు: రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్
బ్యానర్లు: అన్నపూర్ణ స్టూడియోస్ & హాస్య మూవీస్
సంగీతం: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: చోటా కె. ప్రసాద్
పి.ఆర్.ఓ : వంశీ-శేఖర్
తాజా వార్తలు
- బహ్రెయిన్: మత వర్గాన్ని అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు..60 ఏళ్ల వ్యక్తి అరెస్ట్
- స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో బాధపడుతున్న ఏడాది చిన్నారికి దుబాయ్ రూలర్ అండ
- సౌదీ విమానాశ్రయం, అరామ్కో కేంద్రంపై దాడులు చేశామని హూతీలు ప్రకటన
- సెప్టెంబర్ 1 నుంచి కువైట్‌లో విజిట్ వీసా, అబ్సెన్స్ పర్మిట్ పొడిగింపులు నిలిపివేత
- స్పెషలైజ్డ్ వింగ్స్ హెచ్ఓడీలతో డీజీపీ సి.వి.ఆనంద్
- దుబాయ్ రోబోట్యాక్సీ 40 లక్షల కిలోమీటర్లు పూర్తి.. ప్రయాణికుల సంతృప్తి 97 శాతం
- ట్రంప్ హెచ్చరికల పై ఘాటుగా స్పందించిన ఇరాన్
- బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫఖ్రూల్
- సోషల్ మీడియాలో ఎమిరాతీ మహిళలను అవమానించినందుకు UAE చర్యలు
- అల్ రమ్లీ అగ్నిప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం..!!







