2025లో 6.5 మిలియన్లకు పైగా వాహనాలకు పీరియాడిక్ ఇన్స్పెక్షన్..!!
- August 21, 2026
రియాద్: సౌదీ అరేబియాలో 2025లో 6.5 మిలియన్లకు పైగా వాహనాలకు పీరియాడిక్ టెక్నికల్ ఇన్స్పెక్షన్లు నిర్వహించినట్లు సౌదీ స్టాండర్డ్స్, మెట్రాలజీ అండ్ క్వాలిటీ ఆర్గనైజేషన్ (SASO) వెల్లడించింది. 2024తో పోలిస్తే ఈ సంఖ్య సుమారు 500,000 వాహనాలు పెరిగాయి. గత ఏడాది పీరియాడిక్ టెక్నికల్ ఇన్స్పెక్షన్ కేంద్రాలకు సంబంధించి 37,690 ఫిర్యాదులు, నివేదికలు అందినట్లు SASO తెలిపింది. 2025లో సౌదీ అరేబియాలో పీరియాడిక్ వెహికల్ ఇన్స్పెక్షన్ నెట్వర్క్ గణనీయంగా విస్తరించినట్లు సంస్థ పేర్కొంది. అల్-నభానియా, రఫ్హా, సరాత్ అబీదా, అల్-జుల్ఫీ, బిష్, దుబా, షక్వా, అల్-అఫ్లాజ్, సమ్తా, అల్-ముజాహిమియా, అల్-ఖోబర్, అల్-ముత్నిబ్, అఫీఫ్, మదీనా ప్రాంతాల్లో కొత్త ఇన్స్పెక్షన్ కేంద్రాలను ప్రారంభించారు. వీటితోపాటు దమ్మమ్, రియాద్ లో రెండు ఎక్స్‌ప్రెస్ లేన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విస్తరణతో పీరియాడిక్ వెహికల్ ఇన్స్పెక్షన్ సేవలు జనాభాకు మరింత చేరువయ్యాయి. ప్రస్తుతం దేశ జనాభాలో 85 శాతం మందికి 80 కిలోమీటర్ల పరిధిలో ఇన్స్పెక్షన్ సేవలు అందుబాటులో ఉన్నట్లు SASO తెలిపింది.
ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యం
పీరియాడిక్ వెహికల్ ఇన్స్పెక్షన్ సేవల నిర్వహణ కోసం ప్రస్తుతం ఆరు ప్రైవేట్ రంగ సంస్థలతో భాగస్వామ్య విధానంలో పనిచేస్తున్నట్లు SASO వెల్లడించింది. వాహన భద్రతకు సంబంధించిన నిబంధనలపై పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేందుకు 2025లో ఇన్స్పెక్షన్ కేంద్రాలపై 644 ఫీల్డ్ ఇన్స్పెక్షన్ టూర్లు నిర్వహించినట్లు తెలిపింది. అలాగే వాహన భద్రతకు ప్రభావం చూపే అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు ఆరు ప్రత్యేక సాంకేతిక దర్యాప్తులు చేపట్టింది. సంబంధిత అధికారులకు అవసరమైన సాంకేతిక నివేదికలను కూడా అందించింది. ఇన్స్పెక్షన్ ప్రక్రియపై సమగ్ర పర్యవేక్షణ కోసం SASO స్మార్ట్ ఓవర్‌సైట్ మోడల్ ను అమలు చేస్తోంది. ఇందులో సాంకేతిక వ్యవస్థ ద్వారా దేశంలోని అన్ని ఇన్స్పెక్షన్ కేంద్రాలను అనుసంధానించారు. ఈ వ్యవస్థ ద్వారా వాహనం ఇన్స్పెక్షన్ కేంద్రంలో ప్రవేశించినప్పటి నుంచి తనిఖీ పూర్తయ్యే వరకు దాని ప్రయాణాన్ని ట్రాక్ చేయడంతో పాటు, పనితీరు మరియు నిబంధనల అమలుకు సంబంధించిన సూచీలను రియల్‌టైమ్‌లో విశ్లేషించవచ్చు అని SASO వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!







