బాడీ బిల్డింగ్ పేరిట ఇంజెక్షన్ల అక్రమ దందా..నలుగురి అరెస్ట్..!!
- August 21, 2026
హైదరాబాద్: హైదరాబాద్ లో బాడీ బిల్డింగ్ పేరిట మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టైంది. టాస్క్‌ఫోర్స్ గోల్కొండ జోన్, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ఇంజెక్షన్ల సప్లయర్లు, మరో ఇద్దరు వినియోగదారులు ఉన్నారు. నిందితుల నుంచి రూ.1.85 లక్షల విలువైన 50 మెఫెంటర్మైన్ సల్ఫేట్ వాయిల్స్‌తో పాటు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో వాయల్‌ను రూ.160కు కొనుగోలు చేసి, దాదాపు రూ.900కు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధాన నిందితుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ నుంచి వాట్సాప్ ద్వారా ఇంజెక్షన్లను ఆర్డర్ చేసి, షాడోఫ్యాక్స్ కొరియర్ ద్వారా హైదరాబాద్‌కు తెప్పిస్తున్నట్లు గుర్తించారు.
జిమ్‌లో పరిచయమైన ఇద్దరు యువకులు..మొదట కండరాల పెంపు కోసం ఈ ఇంజెక్షన్లను వినియోగించినట్లు పోలీసులు తెలిపారు.అనంతరం వాటి అక్రమ విక్రయాలపై దృష్టి సారించి గోషామహల్ ప్రాంతంలో కస్టమర్లకు విక్రయాలు సాగించినట్లు వెల్లడించారు. ఎంజే బ్రిడ్జి, భోలక్ష్మి మాత ఆలయం సమీపంలో కస్టమర్లకు ఇంజెక్షన్లు విక్రయిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ దందా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ తబూక్లో భారతీయులతో కాన్సుల్ జనరల్ భేటీ..
- రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త.. జీబ్రా క్రాసింగ్‌లనే ఉపయోగించాలి: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- థాయ్‌లాండ్‌లో వెలుగుచూసిన ‘రాక్షస కన్ను’.. పోటెత్తిన పర్యాటకులు
- బాడీ బిల్డింగ్ పేరిట ఇంజెక్షన్ల అక్రమ దందా..నలుగురి అరెస్ట్..!!
- కారిడార్లలో ఫర్నిచర్ నిల్వ చేయొద్దు.. షార్జా సివిల్ డిఫెన్స్ హెచ్చరిక
- షావుకారు జానకి కన్నుమూత..చిరంజీవి తీవ్ర సంతాపం
- పిల్లల సోషల్ మీడియాపై ఆంక్షలు.. యూఏఈ స్కూళ్లో మారనున్న పరిస్థితులు..!!
- సౌదీలో స్కూల్ రవాణా సేవలపై విద్యాశాఖ కీలక మార్గదర్శకాలు..!!
- కటారా ఆహ్వానం.. వీకెండ్ లో కల్చర్, వినోదంతో సందడి..!!
- మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







