భారత కాన్సుల్ జనరల్‌కు GWAC 10వ ఆవిర్భావ దినోత్సవ ఆహ్వానం

- August 22, 2026 , by Maagulf
భారత కాన్సుల్ జనరల్‌కు GWAC 10వ ఆవిర్భావ దినోత్సవ ఆహ్వానం

దుబాయ్: దుబాయ్ లో భారత కాన్సులేట్‌ లో కన్సుల్ జనరల్‌ డా.ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డిని Gulf Workers Awareness Center (GWAC) కార్యవర్గం కలిసి దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 6న డలస్కో అరేనా(ఇండోర్ హాల్), అల్ కుజ్ లో కార్యక్రమానికి GWAC 10వ ఆవిర్భావ దినోత్సవ సమ్మేళనం ఆహ్వాన ప్రతిని అందజేసిన GWAC కార్యవర్గం.

GWAC ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దుబాయి వేదికగా ఏర్పాటు చేసిన GWAC 10వ ఆవిర్భావ దినోత్సవ సమ్మేళనం కార్యక్రమానికి హాజరవుతానని అలాగే ముందుగా తెలియజేయడం వలన షెడ్యూల్ చేసుకున్నానని కాన్సుల్ జనరల్‌ డా.ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా NRI అడ్వైజరీ కమిటీ మెంబర్ కొట్టాల సత్యం గౌడ్ కాన్సుల్ జనరల్‌ డా.ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డిని కలిసి శాలువాతో సన్మానించారు.

ఈ సమావేశంలో కృష్ణ దోనికేని, రవి కటుకం,కొట్టాల సత్యం గౌడ్, మనోజ్ కుమార్ గడదాసు, సత్యం సుతారి, నిరంజన్ గౌడ్ పోతుగంటి, మరియు సందర్పల్లీ నర్సయ్య పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com