కారు గెలిచిన విజేతకు వాల్ క్లాక్.. ఒమన్ కోర్టు కీలక తీర్పు..!!
- August 23, 2026
మస్కట్: ప్రమోషనల్ కాంటెస్ట్‌లో కారు గెలిచినట్లు ప్రకటించిన వ్యక్తికి బహుమతిగా వాల్ క్లాక్ ఇచ్చిన కేసులో ఒమన్‌లోని కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కారు విలువకు సమానమైన OMR 3,600ను విజేతకు చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసును ఒమన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రచురించే ‘అల్-ముజ్తమా వల్-ఖానూన్’ (సొసైటీ అండ్ లా) పత్రిక తన తాజా ఎడిషన్ లో ప్రస్తావించింది. ప్రమోషనల్ ఆఫర్లు, విక్రయ ప్రోత్సాహకాలకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను వివరించే క్రమంలో ఈ కేసును ఉదాహరణగా పేర్కొంది.
కూపన్ నంబర్ ఆధారంగా విజేతగా ప్రకటన
2003 నవంబర్ 10న మస్కట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్లోని కమర్షియల్ సర్క్యూట్ ఈ కేసుపై తీర్పు ఇచ్చింది. ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో కూపన్ నంబర్ ఆధారంగా ఒక వ్యక్తిని కారు విజేతగా ప్రకటించారు. అయితే బహుమతి తీసుకునేందుకు వెళ్లినప్పుడు నిర్వాహకులు అతనికి కారు బదులు వాల్ క్లాక్ ఇచ్చినట్లు కేసులో పేర్కొన్నారు. మొదటి బహుమతి అయిన కారు చివరిగా ప్రకటించిన కూపన్ నంబర్ ఉన్న వ్యక్తికే చెందుతుందని నిర్వాహకులు వాదించినట్లు సమాచారం. అయితే ఇది ప్రజలకు ముందుగా ప్రకటించిన నిబంధనలకు విరుద్ధంగా ఉందని కోర్టు పరిగణించింది.
కారు విలువ చెల్లించాలని ఆదేశం
విజేతకు కారు అందించకుండా వాల్ క్లాక్ ఇవ్వడం సరికాదని భావించిన కోర్టు, కారు విలువైన OMR 3,600ను ఫిర్యాదుదారుడికి చెల్లించాలని ప్రతివాదిని ఆదేశించింది. ప్రమోషనల్ ఆఫర్లు, బహుమతి పథకాల ద్వారా వినియోగదారులను ఆకర్షించే సమయంలో సంస్థలు ప్రకటించిన నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని ఈ తీర్పు స్పష్టం చేస్తుందని ‘సొసైటీ అండ్ లా’ పేర్కొంది.
వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే ప్రమోషనల్ పద్ధతులపై చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని పత్రిక తెలిపింది. అదే సమయంలో వినియోగదారుల ఎంపిక స్వేచ్ఛకు భంగం కలిగించని చట్టబద్ధమైన ప్రమోషనల్ ఆఫర్లను, నిబంధనలను ఉల్లంఘించే ఆఫర్లను వేర్వేరుగా చూడాల్సిన అవసరం ఉందని వివరించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో లోజ్ పండ్ల ధరలకు రెక్కలు..!!
- భారత్ నుంచి మెయిడ్ యూఏఈకి తీసుకురావాలా? రూల్స్, వీసా ప్రక్రియ ఇదే..!!
- కారు గెలిచిన విజేతకు వాల్ క్లాక్.. ఒమన్ కోర్టు కీలక తీర్పు..!!
- అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఖతార్ స్టూడెంట్స్..!!
- కువైట్‌లో ఆన్లైన్ నగదు బదిలీలపై పరిమితి..!!
- సౌదీ అరేబియాలో GCC వాహనాలకు 90 రోజుల గడువు..!!
- ‘టాక్సిక్’ ఈవెంట్లో మల్లారెడ్డి స్పీచ్ వైరల్
- తెలంగాణలో మరో కొత్త విమానాశ్రయం
- UKలో అంబేడ్కర్ ఇంటిని సందర్శించిన సీఎం రేవంత్
- ముంబైలో 22 అడుగుల గణేశ్ విగ్రహం మీద పడి ఇద్దరి మృతి







